ఆ సీన్ కోసం చాలా ఇబ్బంది పడ్డాను : అల్లరి నరేష్- Allari Naresh Interesting Comments About Nandhi Movie

allari naresh interesting comments about nandhi movie,allari naresh,nandhi Movie ,tollywood latest movie naandhi movie - Telugu Allari Naresh, Allari Naresh Interesting Comments About Nandhi Movie, Director Vijay, Interesting Comments, Nandhi Movie, Tollywood Latest Movie Naandhi Movie

2002 సంవత్సరంలో అల్లరి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి కామెడీ పాత్రల ద్వారా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు అల్లరి నరేష్.ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సినిమాలు నరేష్ హీరోగా నిలదొక్కుకోవడానికి కారణమయ్యాయి.2012 సంవత్సరంలో నరేష్ సుడిగాడు సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నాడు.చాలా సినిమాల స్పూఫ్ గా తెరకెక్కిన ఆ సినిమా నటుడిగా కూడా నరేష్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది.

 Allari Naresh Interesting Comments About Nandhi Movie-TeluguStop.com

అయితే ఈ మధ్య కాలంలో నరేష్ హీరోగా నటించిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు.నరేష్ కూడా సరైన బ్లాక్ బస్టర్ హిట్ కోసం చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు.

ప్రస్తుతం అల్లరి నరేష్ హీరోగా బంగారు బుల్లోడు, నాంది సినిమాలు తెరకెక్కుతుండగా నాంది సినిమా ఈరోజు బంగారు బుల్లోడు సినిమా విడుదలైంది.బంగారు బుల్లోడు మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న అల్లరి నరేష్ ఇంటర్యూల్లో మాట్లాడుతూ అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 Allari Naresh Interesting Comments About Nandhi Movie-ఆ సీన్ కోసం చాలా ఇబ్బంది పడ్డాను : అల్లరి నరేష్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నాంది సినిమాలో ఒక సన్నివేశంలో తాను నగ్నంగా కనిపించాలని ఆ సన్నివేశం షూటింగ్ సమయంలో తాను చాలా ఇబ్బంది పడ్డానని అల్లరి నరేష్ చెప్పుకొచ్చారు.ఈ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న విజయ్ టేక్ ఓకే చేసేంత వరకు తాను చాలా ఇబ్బంది పడ్డానని అల్లరి నరేష్ తెలిపారు.

సినిమాకు ఆ సీన్ ఎంతో కీలకం కాబట్టే ఆ సీన్ లో తాను నటించానని అల్లరినరేష్ పేర్కొన్నారు.

క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో విలన్ గా నటించిన వరలక్ష్మీ శరత్ కుమార్ నాంది సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం.

జీ సంస్థ నాంది మూవీ శాటిలైట్, డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేయగా ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలియాల్సి ఉంది.

#TollywoodLatest #AllariNaresh #Allari Naresh #Director Vijay

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు