ఆ న్యూస్ రీడర్ తో ప్రేమలో పడ్డ అల్లరి నరేష్.. ఎందుకు విడిపోయాడో తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈవీవీ సత్యనారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో అద్భుతమైన కామెడీ చిత్రాలను,కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించిన ఇవివి సత్యనారాయణ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

 Allari Naresh Fell In Love With That News Reader Do You Know Why He Broke Up, Al-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ వి వి సత్యనారాయణ వారసులుగా ఇండస్ట్రీలోకి ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ అడుగుపెట్టారు.ఈవీవీ ఉన్నంత వరకు మీరు ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందినప్పటికీ అతని మరణాంతరం రాజేష్ ,నరేష్ ఇండస్ట్రీకి దూరమయ్యారు.

చాలా సంవత్సరాల తర్వాత నరేష్ ఇప్పుడు నాంది అనే సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందారు.

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాలో నటించి ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించిన తరువాత ఆ జంట గురించి ఇండస్ట్రీలో పుకార్లు పుట్టడం సర్వసాధారణం.

ఈ విధంగా అల్లరి నరేష్ గతంలో ఫర్జాన్ అనే హీరోయిన్ తో చెట్టాపట్టాలు తిరగటం వల్ల వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ పెద్దఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి.అయితే అప్పట్లో అల్లరినరేష్ తన గురించి వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని అవన్నీ పుకార్లు మాత్రమేనని వారిపై వస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

ఇలా అల్లరి నరేష్ గురించి బయటకు వచ్చిన ప్రేమ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలియడంతో మరికొన్ని రోజులకు అతను ఒక న్యూస్ రీడర్ తో ప్రేమలో పడ్డారని వార్తలు పెద్ద ఎత్తున ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టాయి.

Telugu Allari Naresh, Love Story, Reader, Tollywood-Movie

గతంలో అల్లరి నరేష్ సాక్షి టీవీ న్యూస్ రీడర్ తో ప్రేమలో ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొట్టాయి.ఈ విషయం గురించి మీడియా అడగడంతో ఇందుకు నరేష్ స్పందిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.తనకు కాబోయే భార్య సాక్షి న్యూస్ రీడర్ లా ఉండాలని కోరుకున్నాను.

అలా కోరుకోవడంలో ఏ మాత్రం తప్పు లేదని అల్లరి నరేష్ చెప్పడంతో వీరి గురించి వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది.అయితే ఈ విధంగా అల్లరి నరేష్ గురించి వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది.

తన తండ్రి మరణం తరువాత అల్లరి నరేష్ 2015 వ సంవత్సరంలో విరూప అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. విరూప ఈవెంట్ ఆర్గనైజర్ గా పనిచేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు.

ఇలా 2015 లో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన అల్లరి నరేష్ 2016వ సంవత్సరంలో ఒక బిడ్డకు జన్మనిచ్చారు.తన తండ్రి మరణం తర్వాత అల్లరి నరేష్ కి సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గాయని చెప్పవచ్చు.

ఈ క్రమంలోనే మహేష్ బాబు మహర్షి సినిమాలో కనిపించిన నరేష్ ఆ తర్వాత నాంది అనే సినిమా అతనికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.ఇలా ఈ సినిమా ద్వారా చాలా రోజులకు ఇండస్ట్రీలో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube