అల్లరి నరేష్ కూతురును మీరు చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో?

కామెడీని నమ్ముకొని సినిమాల్లో నటించడంతో పాటు ఆ సినిమాలతో అల్లరి నరేష్ నటుడిగా సక్సెస్ సాధించారు.కెరీర్ లో వరుసగా ఫ్లాపులు వచ్చిన సమయంలో సరైన కథను ఎంచుకుని బ్లాక్ బస్టర్ హిట్ సాధించి నరేష్ మంచి పేరును తెచ్చుకున్నారు.

 Actor Allari Naresh Daughter Photos Goes Viral In Social Media, Allari Naresh Cu-TeluguStop.com

ఈ ఏడాది నాంది సినిమాతో హిట్ కొట్టిన అల్లరి నరేష్ తన కొత్త సినిమా సభకు నమస్కారం స్టార్ట్ చేయడంతో పాటు కూతురుతో క్లాప్ కొట్టించారు.అల్లరి నరేష్ కూతురు ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

నరేష్ కూతురు పేరు అయాన ఇవిక కాగా నరేష్ కూతురు క్యూట్ గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.పూజా కార్యక్రమాలకు నరేష్ తన కూతురును వెంటబెట్టుకుని వచ్చారు.

పలువురు స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్ల పిల్లలు బాల నటులుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో అల్లరి నరేష్ కూతురు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.సతీష్ మల్లంపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

2015 సంవత్సరంలో అల్లరి నరేష్ విరూపను వివాహం చేసుకోగా 2016 సంవత్సరం సెప్టెంబర్ నెలలో అయాన జన్మించారు.

Telugu Allari Naresh, Ayana Ivika, Cute, Naresh, Pooja-Movie

రొటీన్ కామెడీ కథలను ప్రేక్షకులకు నచ్చకపోవడంతో కొత్తతరహా కథ, కథనాలు ఉన్న సినిమాలను నరేష్ ఎంచుకుంటున్నారు.సభకు నమస్కారం సినిమా పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కనుందని తెలుస్తోంది.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక ప్రక్రియ జరగనుంది.

Telugu Allari Naresh, Ayana Ivika, Cute, Naresh, Pooja-Movie

జూనియర్ ఎన్టీఅర్ పీఆర్వో మహేష్ ఎస్ కోనేరు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.నరేష్ కెరీర్ లో 58వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం.నరేష్ నటిస్తున్న సభకు నమస్కారం సినిమా సక్సెస్ సాధిస్తే నరేష్ కు ఆఫర్లు మరింత ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి.నరేష్ ఈ సినిమాలో మరో సక్సెస్ సాధిస్తానని భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube