ఈయన కెరీర్‌ కు ఇదే కీలకం.. ఇది కనుక మిస్‌ అయితే ఇక కష్టమే

అల్లరి సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు నరేష్‌ వచ్చిన సమయంలో ఎవరు కూడా ఇతడు హీరోగా పనికి వస్తాడని భావించలేదు.కాని అనూహ్యంగా అల్లరి నరేష్‌ అయ్యి వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు.

 Allari Naresh Career Depend On Naandi Movie, Tollywood ,allari Naresh, Nandi Mov-TeluguStop.com

అల్లరోడు కాస్త యంగ్‌ ట్యాలెంటెడ్‌ హీరోగా పేరు దక్కించుకుని మినిమం గ్యారెంటీ హీరోగా ఓ పదేళ్ల పాటు కంటిన్యూ అయ్యాడు.కాని సుడిగాడు తర్వాత ఇప్పటి వరకు అల్లరి నరేష్‌ సినిమాలు ఒక్కటి అంటే ఒక్కటి కూడా సక్సెస్‌ అవ్వలేదు.

ఈయన ఏ సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతూ వచ్చింది.ప్రతి సినిమా కూడా నిరాశ పర్చింది.

దాంతో అల్లరి నరేష్‌ సినిమా అంటే ప్రేక్షకులు లైట్‌ తీసుకునే పరిస్థితి వచ్చింది.అల్లరోడి సినిమా అంటే ప్రేక్షకులు బాబోయ్‌ అంటున్నారు.

ఇలాంటి సమయంలో అల్లరోడు కామెడీ సినిమాలు మానేసి సీరియస్‌ గా సినిమా లు చేయాలని ఫిక్స్‌ అయ్యాడు.

కెరీర్‌ లో ఇప్పటికే ఒకటి రెండు సార్లు సీరియస్‌ పాత్రలు చేసిన అల్లరి నరేష్‌ పూర్తి స్థాయి సీరియస్‌ పాత్రను చేసేందుకు గాను నాందితో ముందుకు వచ్చాడు.

నాంది సినిమాతో మరో రేంజ్‌ లో అల్లరోడు ప్రేక్షకులను ఆకట్టుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు.ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా కనుక ప్రేక్షకులను అలరించకుంటే అల్లరోడు సీరియస్ పాత్రలు చేసేందుకు కూడా కమిట్‌ అయ్యి నాందీతో నాంది పలికాడు.ఈ సినిమా తర్వాత వరుసగా సీరియస్‌ పాత్రలు చేస్తానంటూ చెప్పిన నరేష్‌ కు ఈ సినిమా ఫలితం చాలా కీలకంగా మారింది.

మరి ఈ సినిమా ఆయనకు ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది అనేది చూడాలి.ఈ సినిమా ఫలితం బెడిసి కొడితే ఖచ్చితంగా అల్లరోడు మళ్లీ ఆలోచనల్లో పడాల్సి రావచ్చు.

కామెడీ సినిమాలు చేయాల్సిన అల్లరోడు సీరియస్‌ పాత్రలు చేయడం పట్ట ఆయన అభిమానులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube