ఏడాదికి 8 సినిమాలు చేసిన హీరో ఎవరో తెలుసా?

అల్లరి నరేష్.స్టార్ కామెడీ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన హీరో అల్లరి నరేష్.

 Allari Naresh,8 Movies In A Year ,biggest Gap In Career,tollywood,year 2020no Mo-TeluguStop.com

ఈవీవీ సత్యనారాయణ కు అల్లరి నరేష్ కంటే ముందే ఒక కొడుకు ఉన్నాడు.అతడే ఆర్యన్ రాజేష్.

సొంతం సినిమా హీరో.ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇలా ఇద్దరు కొడుకులను హీరోలు చెయ్యగా ఎక్కువగా అల్లరి నరేష్ కామెడీ హీరోగా మంచి గుర్తింపు పొందాడు.

అలాంటి అల్లరి నరేష్ 2002లో అల్లరి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయినా అల్లరి నరేష్ 2015 వరకు ఆగకుండా సినిమాలు చేస్తూ వచ్చాడు.

మంచి హావ కొనసాగింది.సంవత్సరానికి నాలుగు ఐదు సినిమాలు ఖచ్చితంగా చేస్తూ వచ్చేవాడు.కానీ ఇప్పుడు చాలా తక్కువ.నిజం చెప్పాలంటే మొన్న మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమాలో అల్లరి నరేష్ నటించడం వల్ల మళ్లీ నరేష్ ఫార్మ్ లోకి వచ్చాడు.

అలాంటి నరేష్ 2020 ఏడాది ఒక్క సినిమా కూడా చెయ్యలేదు.

అతను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఇప్పటికి 18 ఏళ్ళు అవుతే ప్రతి ఏడాది 3, 4 సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు.

ఇక 2008 సంవత్సరంలో అయితే అతను ఏకంగా 8 సినిమాల్లో నటించాడు అంటే మీరు ఏ అర్ధం చేసుకోండి.అప్పట్లో అల్లరి నరేష్ క్రేజ్ ఎలా ఉండేదో.

ఇక అలాంటి అల్లరి నరేష్ కు 2020 ఒక్క సినిమా కూడా చెయ్యకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.ఇప్పుడు ఎంతో జాగ్రత్తగా అల్లరి నరేష్ మంచి కథలతో మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు ఈ ఏడాది వచ్చేస్తున్నాడు.

ఏడాదికి ఎనిమిది సినిమాలు.ఈ జనరేషన్ హీరోస్ ఎవరు కూడా అంత స్పీడ్ గా చేయలేదనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube