బంగారు బుల్లోడు మూవీ హిట్టా.. ఫ్లాపా..?- Allari Naresh Bangaru Bullodu Movie First Talk

allari naresh bangaru bullodu movie first talk-bamgaru bullodu-allarinaresh-pooja javeri-balayya-emototinal-comady movie-tollywood- - Telugu Allari Naresh, Bangaru Bullodu Movie, First Talk, Yavarage Response

అల్లరి నరేశ్, పూజా జవేరి జంటగా నటించి పీవీ గిరి దర్శకత్వంలో తెరకెక్కి ఈరోజు విడుదలైన సినిమా బంగారు బుల్లోడు.కామెడీ సినిమాల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న అల్లరి నరేష్ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోవడం లేదు.

 Allari Naresh Bangaru Bullodu Movie First Talk-TeluguStop.com

నటుడిగా అల్లరి నరేష్ బాగానే చేస్తున్నా రొటీన్ కామెడీని ప్రేక్షకులు ఇష్టపడకపోవడంతో నరేష్ సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.

వరుస ఫ్లాపుల నేపథ్యంలో రెగ్యులర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బంగారు బుల్లోడు సినిమాకు ప్రేక్షకుల నుంచి యావరేజ్ టాక్ వస్తోంది.

 Allari Naresh Bangaru Bullodu Movie First Talk-బంగారు బుల్లోడు మూవీ హిట్టా.. ఫ్లాపా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అల్లరి నరేష్ ప్రేక్షకులకు సినిమా నచ్చుతుంది కానీ సాధారణ ప్రేక్షకులను ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పాలి.సినిమాలో రుణాలు ఇచ్చే బ్యాంక్ ఉద్యోగి పాత్రలో అల్లరి నరేష్ నటించాడు.

సీతానగరంలో అందరికీ పెళ్లిళ్లు జరుగుతున్నా అల్లరి నరేష్ కు, అతని సోదరులకు మాత్రం పెళ్లిళ్లు కావు.

అయితే భవాని ప్రసాద్ తాత చేసిన తప్పు వల్లే అతనికి పెళ్లి కావడం లేదని తెలుస్తోంది.అమ్మవారి నగలకు భవాని ప్రసాద్ కుటుంబానికి సంబంధం ఏమిటి ? తాత చేసిన తప్పును భవానీ ప్రసాద్ సరిదిద్దాడా ? అనే కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది.బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన బంగారు బుల్లోడు సినిమా టైటిల్ తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన నరేష్ కథ, ఎమోషన్స్ బాగానే ఉన్నా ప్రేక్షకులను మెప్పించేలా కథనం లేకపోవడంతో సినిమాను సక్సెస్ చేయెలేకపోయాడు.

రొటీన్ కామెడీ సన్నివేశాలు ఈ సినిమాకు మైనస్ గా మారాయి.కైమాక్స్ బాగానే ఉన్నప్పటికీ మిగిలిన సన్నివేశాలు కూడా అదే స్థాయిలో ఉంటే సినిమా హిట్ అయ్యేది.

సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ బాగానే ఉన్నా కథనం బాగా లేకపోవడం సినిమాకు మైనస్ గా ఉంది.

.

#BangaruBullodu #Allari Naresh #First Talk

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు