అల్లరి నరేష్ కి జోడీగా కాజల్ అగర్వాల్  

Allari Naresh And Kajal Agarwal Combination In Suresh Productions - Telugu Allari Naresh, Allari Naresh And Kajal Agarwal Combination, Kajal Aggarwal, Suresh Productions

టాలీవుడ్ లో రాజేంద్రప్రసాద్ తర్వాత ఆ స్థాయిలో కామెడీ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంత చేసుకున్న నటుడు అల్లరి నరేష్.అయితే ఈ మధ్య కాలంలో అల్లరి నరేష్ కామెడీ టైమింగ్ ఫెయిల్ అవడంతో వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి.

 Allari Naresh And Kajal Agarwal Combination In Suresh Productions

దీంతో ఇప్పుడు జోనర్ మార్చి క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నాంది అనే సినిమాలో అల్లరి నరేష్ నటిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు అల్లరోడు మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.అది కూడా సురేష్ ప్రొడక్షన్ లో కావడం విశేషం.

అల్లరి నరేష్ కి జోడీగా కాజల్ అగర్వాల్-Gossips-Telugu Tollywood Photo Image

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు కూడా ఎక్కువ కొంటూ రిలీజ్ చేయడంతో పాటు నిర్మిస్తున్న సురేష్ బాబు వాటి మీద మంచి లాభాలు సొంతం చేసుకుంటున్నాడు.గత ఏడాది కొరియన్ మూవీని సమంతగా ఓ బేబీ అంటూ రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టాడు.

ఇప్పుడు మరో కొరియన్ మూవీ అయిన డాన్సింగ్ క్వీన్ ని తెలుగులో రీమేక్ చేయడానికి రైట్స్ సొంతం చేసుకున్నాడని తెలుస్తుంది.ఇందులో అల్లరి నరేష్ ని కీలక పాత్ర కోసం ఫైనల్ చేయడం జరిగిందని సమాచారం.

ఇక ఇందులో టైటిల్ రోల్ కోసం కాజల్ అగర్వాల్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారని టాక్.ఇక ప్రస్తుతానికి భారతీయుడు సీక్వెల్ మాత్రమే కాజల్ అగర్వాల్ చేస్తుంది.

అయితే ఆ సినిమాకి అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి.ఈ నేపధ్యంలో ఈ డాన్సింగ్ క్వీన్ చేయడానికి ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.

త్వరలో ఈ సినిమా గురించి పూర్తి సమాచారం బయటకి వచ్చే అవకాశం ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Allari Naresh And Kajal Agarwal Combination In Suresh Productions Related Telugu News,Photos/Pics,Images..

footer-test