కొమరాం భీమ్ బయోపిక్ తెరపైకి… పాన్ ఇండియా రేంజ్ లో  

Allani Sridhar Is Planning Komaram Bheem Movie In Pan India, Tollywood, Bollywood, Telugu Cinema,Komaram Bheem Movie, Komaram Bheem Biopic - Telugu Allani Sridhar, Allani Sridhar Is Planning Komaram Bheem Movie In Pan India, Bollywood, Komaram Bheem Biopic, Komaram Bheem Movie, Pan India, Telugu Cinema, Tollywood

దర్శక దిగ్గజం రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో ఎన్ఠీఆర్ పాత్రని కొమరాం భీం స్ఫూర్తిగా తీసుకొని డిజైన్ చేసినట్లు గతంలో ప్రకటించాడు.

TeluguStop.com - Allani Sridhar Is Planning Komaram Bheem Movie In Pan India

అయితే తాజాగా టీజర్ లో అతనిని ఒక ముస్లిం యువకుడుగా రిప్రజెంట్ చేయడంతో కాస్తా వివాదం రేగుతుంది.అయితే ఇది పూర్తి స్థాయి కల్పిత కథ అని, ఒరిజినల్ కథకి తన కథకి ఏమాత్రం సంబంధం లేదని, కేవలం పాత్రలని స్ఫూర్తిగా తీసుకొని తాను రాసుకున్న కల్పిత కథ అని గతంలో రాజమౌళి క్లారిటీ ఇచ్చేశాడు.

అయినా కూడా అల్లూరి, కొమరాం భీమ్ ని అభిమానించే ఆదివాసీ సంఘాలు కొంత హడావిడి చేస్తున్నాయి.ఇదిలా ఉంటే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సంగతి పక్కన పెడితే భీమ్ జీవిత చరిత్ర ఆధారంగా 1990లో అల్లాని శ్రీధర్ కొమరాం భీమ్ అనే సినిమాను తెరకెక్కించాడు.

TeluguStop.com - కొమరాం భీమ్ బయోపిక్ తెరపైకి… పాన్ ఇండియా రేంజ్ లో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అప్పట్లో ఆ సినిమాకి నంది అవార్డు కూడా వచ్చింది.ఇప్పుడు కొమరాం భీమ్ కథతో ఒక సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు.

హిందీ ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకు వెళ్లేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి.దర్శకుడు అల్లాని శ్రీధర్ మరోసారి కొమరాం భీమ్ సినిమాను తెరకెక్కించబోతున్నట్లుగా పేర్కొన్నాడు.

ఈ సారి పాన్ఇండియా రేంజ్ లో ఈ సినిమాని ఆవిష్కరించబోతున్నట్లు స్పష్టం చేశాడు.భీమ్ పోరాటం, జీవిత విశేషాలు ప్రతి ఒక్కరికి చేరవేయాలనే ఉద్దేశ్యంతో మరోసారి ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో ఆవిష్కరించబోతున్నట్లుగా చెప్పారు.

త్వరలో దీనికి సంబందించిన అన్ని వివరాలు తెలియజేస్తామని అన్నారు.

#KomaramBheem #AllaniSridhar #KomaramBheem #Pan India #Allani Sridhar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Allani Sridhar Is Planning Komaram Bheem Movie In Pan India Related Telugu News,Photos/Pics,Images..