ఒకే ఇంట్లో 66 ఓట్లు.. ఆ ఓట్లు రాబట్టుకునేందుకు నాయకులు చేసే ప్రయత్నాలకు నవ్వు ఆగదు

దేశంలో పార్లమెంటుకు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి.ఇప్పటికే అయిదు దశలు పూర్తి కాగా, నేడు ఆరవ దశ ఎన్నికలు జరుగుతున్నాయి.

 Allahabads Largest Family Eats Together Votes Together 66-TeluguStop.com

పెద్ద ఎత్తున ధన ప్రవాహం ఈ ఎన్నికల్లో జరుగుతున్న విషయం తెల్సిందే.ప్రతి ఒక్కరు కూడా డబ్బును కోట్లల్లో ఖర్చు పెడుతున్నారు.

ముఖ్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెడుతూ ఈ ఎన్నికలను అత్యంత ఖరీదైన ఎన్నికలుగా మార్చేస్తున్నారు.ఒక ఇంట్లో పది అంతకు మించి ఓట్లు ఉంటే ఆ ఓట్లు మొత్తం దక్కించుకునేందుకు ఆ కుటుంబంకు ప్యాకేజీలు ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం.

అయితే ఒకే ఇంట్లో 66 ఓట్లు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక సారి ఆలోచించొచ్చు.ఆ ఇంటి చుట్టు క్యాండిడేట్‌ తిరగడం ఖాయం.

అలహాబాద్‌లోని బరైదా గ్రామానికి చెందిన రామ్‌ నరేష్‌ది ఉమ్మడి కుటుంబం.98 ఏళ్ల వయసులో కూడా తన కుటుంబం అంతా కూడా కలిసి ఉండేలా ఈయన చూస్తున్నాడు.రామ్‌ నరేష్‌ కుటుంబ సభ్యుల మొత్తం సంఖ్య 82.అందులో 66 మందికి ఓట్లు ఉండటం విశేషం.ఈసారి రామ్‌ నరేష్‌ ముని మనవళ్లు 8 మంది కొత్తగా ఓటు వేసేందుకు సిద్దం అయ్యారు.ఇంత మంది ఓట్లు వేస్తే చాలా కీలకంగా ఉంటుంది.కొన్ని సార్లు పదికి అటు ఇటుగా ఓడిపోయే అవకాశం ఉంటుంది.అందుకే ప్రతి ఒటు చాలా ప్రత్యేకం.

అందుకే రామ్‌ నరేష్‌ కుటుంబ సభ్యుల ఓట్లను దక్కించుకునేందుకు స్థానిక నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంటారు.

ఒకే ఇంట్లో 66 ఓట్లు ఆ ఓట్లు రాబ�

రామ్‌ నరేష్‌ కుటుంబంకు స్థానికంగా పోటీ చేసిన ప్రతి అభ్యర్థి కూడా పెద్ద మొత్తంలో ప్యాకేజీని ప్రకటించడంతో పాటు, వారి కోర్కెలు తీర్చేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం తాజాగా ఒక అభ్యర్థి రామ్‌ నరేష్‌ తనయుడిని కలిసి లక్ష రూపాయలు ఇస్తానంటూ చెప్పాడట.కాని రామ్‌ నరేష్‌ కుటుంబ సభ్యులు మాత్రం డబ్బుకు ఆశ పడటం లేదని అంటున్నారు.వారు మంచి వ్యక్తిని చూసి వేస్తామని, తప్పకుండా ప్రజాస్వామ్య విలువలు కాపాడతామని అంటున్నారు.66 మందికి ఒకే పోలింగ్‌ బూత్‌లో ఓటు ఉండటం విశేషం.మొత్తానికి దేశంలోనే అత్యధిక ఓట్లు ఉన్న కుటుంబంగా రామ్‌ నరేష్‌ కుటుంబం రికార్డు సాధించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube