అమెరికా అధ్యక్షుడికారు..వందల మంది సైన్యంతో సమానమాట...!!  

All You Must Know About Trump\'s Car - Telugu Agra Airport, All You Must Know About Trump\\'s Car, Donald Trump, Nri, Telugu Nri News, The Beast, Trump Car Features

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మొదటి సారిగా అమెరికా అధ్యక్షుడి హోదాలో భారత్ లో పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే ట్రంప్ పర్యటన నిమిత్తం గుజరాత్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి ఏర్పాట్లు చేస్తున్నాయి.

All You Must Know About Trump's Car - Telugu Agra Airport Trump\\'s Donald Trump Nri News The Beast Features

ఊహించని రీతిలో కనీ వినీ ఎరుగని విధంగా ట్రంప్ స్వాగత ఏర్పాట్లని చేపట్టిన ప్రభుత్వాలు అదే తరహాలో భద్రతా ఏర్పాట్లు కూడా చేపట్టాయి.అయితే అమెరికా అధ్యక్షుడు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ముందుగానే అక్కడి భద్రతా విషయాలపై ముదస్తూ జాగ్రత్తలు తీసుకునే ఆయన సొంత సెక్యూరిటీ ఇప్పటికే భారత్ లో ట్రంప్ పర్యటించే ప్రాంతాలపై తమదైన నిఘా పెట్టింది.
ఇదిలాఉంటే భారత్ కల్పించే భద్రతా, ట్రంప్ కి పర్సనల్ గా అమెరికా ప్రభుత్వం కల్పించే భద్రత ఇవన్నీ ఒకెత్తయితే.వందల మంది సైన్యంతో సమానమైన ట్రంప్ కారు అత్యంత ప్రత్యేకమైనది.

ఇప్పటికే గుజరాత్ చేరుకున్న ఈ కారు ట్రంప్ ఎక్కడికి వెళ్ళినా సరే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.దీని పేరు బీస్ట్.ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన సురక్షనమైన కారు మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు.ఈ కారుని కాడిలాక్ వన్, ఫస్ట్ కార్ అని కూడా పిలుస్తారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు కెనడీ హత్య అనంతరం అధ్యక్షుడు ఉపయోగించే కారుని మరింత రక్షణ ఉండేలా రూపొందించారు.ఈ కారు ప్రత్యేకతలు ఏమిటంటే.
ఈ బీస్ట్ కారు యొక్క అద్దాలు దాదాపు 5 అంగుళాల మందం కలిగి ఉంటాయి.స్టీల్, అల్యూమినియం ,టైటానియం, సిరామిక్ తో తయారయిన ఈ కారు ఎలాంటి బాంబు పేలుళ్లు జరిగినా తట్టుకునేలా ఉంటుంది.

అత్యంత విలాసవంతంగా, శత్రు దుర్భేధ్యంగా ఉంటుంది.ఈ కారు టైర్లు పంచర్ అవకుండా ఉండేలా రూపొందిచారు.ఒకవేళ టైర్ పేలినా సరే రిమ్ తో కూడా కారుని నడిపేయచ్చు.ఈ కారు డోర్లు బోయింగ్ 757 విమానానికి ఉండే డోర్లు కలిగి ఉంటాయి.
ఈ కారు రాత్రి సమయంలో ప్రయాణం చేసినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా నైట్ విజన్ కెమెరాలు కూడా ఉంటాయి.ఈ కారుని డ్రైవర్ గా సీక్రెట్ ఏజెంట్ మాత్రమే ఉంటాడు.

ఎలాంటి సమయంలో పరిస్థితులలో ఐన సరే కారుని నడపగలిగేలా శిక్షణ ఇస్తారు.అంతేకాదు ఈ కారులోనుంచీ అధ్యక్షుడు నేరుగా రక్షణ శాఖ పెంటగాన్, వైస్ ప్రెసిడెంట్ కి ఫోన్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది.

అత్యవసర సమయంలో ఉపయోగ పడేలా అధ్యక్షుడి బ్లడ్ గ్రూప్ రక్తిం, ఆక్సిజన్ సైతం అందుబాటులో ఉంటాయి.

తాజా వార్తలు

All You Must Know About Trump\'s Car-all You Must Know About Trump\\'s Car,donald Trump,nri,telugu Nri News,the Beast,trump Car Features Related....