తెలంగాణ ప్రభుత్వం కరోనా నిబంధనలు మరింత కఠినంగా అమలు చేస్తోంది.నిన్నటి వరకు రాష్ట్రంలో విద్యా సంస్థలు .
పరీక్షలు రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో థియేటర్లు కూడా రేపటి నుండి క్లోజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది.తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సినీ ఇండస్ట్రీ ఇరకాటంలో పడినట్లయింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సహకరిస్తూ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఓకే చెప్పడం జరిగింది.ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ నటించిన “వకీల్ సాబ్” సినిమా ప్రదర్శించే సినిమా థియేటర్లు మినహా మిగతా వాటిని మూసేయాలని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సంగం డిసైడ్ అయ్యింది.
ఏపీలో మాత్రం థియేటర్ల విషయంలో 50 శాతం సిట్టింగ్ కి అనుమతులు ఇస్తూ .ప్రదర్శనలు వేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది.ఏదిఏమైనా కరోనా సెకండ్ వేవ్ వలన సినిమా ఇండస్ట్రీకి కూడా గట్టిగానే నష్టాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు రాత్రి నుండి నైట్ కర్ఫ్యూ కూడా తెలంగాణ ప్రభుత్వం విధించడం జరిగింది.
పబ్బులు, క్లబ్బులు వంటి వాటిపై కూడా ఆంక్షలు విధించింది.