ప‌ద‌వుల‌న్నీ హుజూరాబాద్‌కే.. టీఆర్ ఎస్ మాస్ట‌ర్ ప్లాన్‌

ఇప్పుడు టీఆర్ ఎస్‌కు గానీ లేదంటే బీజేపీకి గానీ ఎంత ముఖ్య‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.ఎలాగైనా అక్క‌డ జెండా ఎగ‌రేయాల‌ని రు పార్టీలు ప‌ట్టుబ‌డుతున్నాయి.

 All The Seats Are In Huzurabad Trs Master Plan, Huzurabad, Trs, Nominated Seats-TeluguStop.com

అయితే కామ‌న్ గానే అధికార‌లో ఉంది కాబ‌ట్టి టీఆర్ ఎస్ పార్టీ కొంత ముందే ఉంద‌ని చెప్పాలి.ఇప్ప‌టికే అక్క‌డ గెలిచేందుకు ఏకంగా ద‌ళిత బంధు లాంటి స్కీమ్‌ను ప్ర‌వేశ పెట్టిందంటేనే ఎంత సీరియ‌స్‌గా తీస‌కుందో అర్థం అవుతోంత‌ది.

ఇక టీఆర్ ఎస్ పార్టీకి దూర‌మ‌వుతున్న అన్ని వ‌ర్గాల‌ను కేసీఆర్ టార్గెట్ చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.ఇప్ప‌టికే పోటీ లేకుండా కూడా చూసుకున్నారు.

ఇందులో భాగంగానే కౌశిక్ రెడ్డిని కాంగ్రెస్ నుంచి త‌ప్పించి ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి కూడా ఇచ్చేశారు.రాష్ట్రంలోని ఏ నియోజ‌క‌వ‌ర్గానికి ద‌క్క‌న‌న్ని ప‌దువులు ఇప్పుడు హుజూరాబాద్‌కే ద‌క్కుతున్నాయి.

ఇప్ప‌టికే అత్య‌ధిక నిధులు కేటాయిస్తూ ఆ నియోజ‌క‌వ‌ర్గాన్ని డెల‌ప్ చేస్తున్నారు.ఇంకోవైపు కొత్త పిఛ‌న్లు, లేదంటే కొత్త ప‌త‌కాల‌ను కూడా ఇక్క‌డే స్టార్ట్ చేస్తున్నారు సీఎం కేసీఆర్‌.

అయితే ఇంత చేస్తున్నా కూడా ఎక్క‌డో ఏదో కావాల‌ని ఆలోచిస్తున్నారు.ఇందులో భాగంగా నామినేటెడ్ పోస్టుల‌ను హుజూరాబాద్‌కు క‌ట్ట‌బెడుతున్నారు.

Telugu Banda Srinivas, Huzurabad, Kcr Master, Koushik Reddy, Mlc Seat-Telugu Pol

దీంతో హుజూరాబాద్ లోకల్ లీడ‌ర్లు జోష్ లో ఉన్నారనే చెప్పాలి.బీసీ వ‌ర్గాల్లో ఎలాగైనా మ‌ద్ద‌తు తెచ్చుకోవ‌డం కోసం నానా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.ఇందులో భాగంగానే ఇప్పుడున్న నామినేటెడ్ పదవులు ఇస్తూ కొత్త ఉత్సాహం నింపుతున్నారు కేసీసార్‌.ఇందులో భాగంగానే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా బండ శ్రీనివాస్ కు ప‌ద‌వి కేటాయంచారు.

ఇక బీసీ కమిషన్ చైర్మన్ గా అయితే వకుళాభరణం కృష్ణ మోహన్ కు ప‌ద‌వి ఇచ్చి అంద‌రినీ ఆక‌ట్టుకునే విధంగా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు.అయితే మొత్తం ప‌ద‌వులు హుజూరాబాద్ ద‌క్క‌డంతో టీఆర్ ఎస్‌లో మ‌ళ్లీ కుమ్ములాట‌లు మొద‌లువుత‌న్నాయంట‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube