అన్నీ పార్టీలదీ అదే దారి ? సీనియర్ నేతల్లో ఆందోళన ? 

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు ఒకటే బాటలో పయనించేందుకు సిద్ధమవుతున్నాయి.

టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీలలో సీనియర్ నేతలు ఎక్కువగా ఉండడంతో, పాత తరహా రాజకీయాలే ఇంకా చోటుచేసుకుంటున్నాయి.ఇప్పుడు ట్రెండ్ ను మార్చేందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి.

ప్రస్తుతం టీఆర్ఎస్, బీజేపీ ,కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు తీవ్రంగా ఉంది.ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తూనే, అధికార పార్టీ టిఆర్ఎస్ కు చెక్ పెట్టే విధంగా ప్రతిపక్షాలు వ్యవహారాలు చేస్తున్నాయి.

ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేసేందుకు అధికార పార్టీ టిఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది.ఈ క్రమంలోనే సరికొత్త రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

Advertisement

    ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ విషయాన్ని తీసుకుంటే, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు సీనియర్లు ఆయనను దూరం పెడుతునే ఉన్నారు.ఆయన బాటలో నడిచేందుకు ఇష్టపడకపోవడం ఇలా ఎన్నో కారణాలతో రేవంత్ రెడ్డి యువ నాయకులకు ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తున్నారు ఇటీవల రేవంత్ రెడ్డి నిర్వహించిన అనేక  సభలు, నిరసన కార్యక్రమాల్లో యువ నాయకులు యాక్టివ్ గా వ్యవహరించారు.

అన్నీ తామే అయ్యి పార్టీలో కీలకంగా వ్యవహరించారు.సోషల్ మీడియాలోను రేవంత్ చేపడుతున్న పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడంలో యువ నాయకులు, యువత ఎక్కువగా కష్టపడుతున్నారు.

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న పాదయాత్ర లోనూ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఈ విధంగా సభలను సక్సెస్ చేస్తున్నారు.   

  రాబోయే ఎన్నికల్లోనూ అటు బిజెపి, కాంగ్రెస్ పార్టీలు యువ నాయకులకు సీట్లు పెద్దఎత్తున కేటాయించేందుకు సిద్ధమవుతున్నాయి.అలాగే అధికార పార్టీ టిఆర్ఎస్ కూడా ఇదే విధమైన వ్యూహం తో కదులుతోంది.రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ లో కేటీఆర్ ప్రభావం మరింతగా పెరగబోతుండడం,  సీఎంగా ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉండడంతో, టిఆర్ఎస్ చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్1, ఆదివారం 2024

కార్పొరేషన్ పదవుల్లోనూ ఇదేవిధంగా యువతకు  ప్రాధాన్యం దక్కింది.మంత్రి మండలిలో ఉన్న వారిలో యువ మంత్రులకు కేసీఆర్, కేటీఆర్ ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు.ఉద్యమకాలం  నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ల కంటే యువ నాయకులకు ఎక్కువగా  ప్రాధాన్యం దక్కుతోంది.

Advertisement

ఈ విధంగా మూడు పార్టీలు సీనియర్లను పక్కన పెడుతూ యువకులను ప్రోత్సహిస్తూ ఉండటం, సీనియర్ నాయకులకు ఆందోళన కలిగిస్తోంది.రాబోయే రోజుల్లో తమకు ప్రాధాన్యం అంతంతమాత్రంగానే ఉండబోతుందనే సంకేతాలు ఇప్పటి నుంచే  రావడంతో వారిలో ఆందోళన పెరిగిపోతోంది.

తాజా వార్తలు