సీట్ల విషయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ( Pawan Kalyan, )హాట్ కామెంట్స్ చేశారు.ఎన్ని స్థానాలు తీసుకోవాలో తనకు తెలుసని పేర్కొన్నారు.
ఏమీ తెలియకుండా తాను రాజకీయాల్లోకి వచ్చాననుకుంటున్నారా అని ప్రశ్నించారు.ఒంటరిగా పోటీ చేస్తే సీట్లు సాధిస్తాం కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమన్నారు.
అందుకే పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్నామని తేల్చి చెప్పారు.అయితే కొన్నిసార్లు ఆటుపోట్లు తప్పవని పేర్కొన్నారు.
పొత్తుల్లో భాగంగా మూడో వంతు సీట్లు తీసుకుంటున్నామని తెలిపారు.టీడీపీతో పాటు జగన్( YS jagan ) తమను కూడా వదలడం లేదన్న పవన్ కల్యాణ్ సొంత చెల్లిని వదలని వ్యక్తి తమను వదులుతాడా అని ప్రశ్నించారు.వైఎస్ జగన్ కు ఊరంతా శత్రువులేనని తెలిపారు.వైసీపీ నేతలకు కష్టం వస్తే తన దగ్గరకు రావాలన్నారు.ఏపీలో మరోసారి జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాకూడదని స్పష్టం చేశారు.