అన్ని రాష్ట్రాల్లోనూ ' లాక్ ' లు ? కరోనా పై సెల్ఫ్ కంట్రోల్ అస్త్రం ? 

అక్కడ లేదు ఇక్కడా లేదు అనకుండా,   ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి మరోసారి తన విజృంభణ ను జనాలకు చూపిస్తోంది.  ప్రపంచవ్యాప్తంగా గతంతో పోలిస్తే భారీ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

 All States Unofficially Imposing Lockdowns Across The Country, #covid-19inandhra-TeluguStop.com

  ఇక భారత్ లోను ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి.ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే , భారత్ లో ఈ  కేసుల నమోదులో దాదాపు టాప లోనే ఉంది.

ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ ను భారత్ అందిస్తున్న, ఇక్కడే తీవ్రస్థాయిలో కేసులు నమోదు కావడం గమనార్హం.గత ఏడాది ఇదే రోజుల్లో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అయింది.

కరోనా కట్టడికి అది ఒక్కటే మార్గమని ప్రధాని నరేంద్రమోదీ లాక్ డౌన్ విధించారు.  కానీ దాని కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది.

ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలడం కారణంగా  ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

కరోనా తీవ్రత కంటే , లాక్ డౌన్ కారణంగా నే జనాలు ఎక్కువగా నష్టపోవాల్సి వచ్చింది.

ముఖ్యంగా వలస కూలీల పాలిట శాపంగా మారిపోయింది.దీంతో మరోసారి లాక్ డౌన్ విధించాలనే ఆలోచన కేంద్రం చేయడం లేదు.

కానీ ఆయా రాష్ట్రాలు సొంతంగా లాక్ డౌన్ విధించు కునే వెసులుబాటు కల్పించింది.కరోనా వైరస్ విజృంభిస్తున్న రాష్ట్రాలలో ఇప్పటికే లాక్ డౌన్ నిబంధనలు అనధికారికంగా అమలవుతున్నాయి .కొన్నిిచట్ల సంపూర్ణ విధించుకునే దిశగా నిర్ణయాలు వెలువడుతున్నాయి.దేశవ్యాప్తంగా నిత్యం రెండున్నర లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

ఇక మహారాష్ట్ర లో ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉండడంతో,  లాక్ డౌన్ అమలు చేశారు.  ఇక ఢిల్లీ లో నిన్న సోమవారం నుంచి వారం రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించింది.

Telugu Bjp, Carona, Covid, Lock, Modhi, Telangana-Telugu Political News

మహారాష్ట్ర సైతం ఆ దిశగానే అడుగులు వేస్తుండగా, తెలంగాణలో హైకోర్టు సూచనల మేరకు లాక్ డౌన్ విధించే ఆలోచనలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఏపీలో ప్రభుత్వ స్కూళ్లకు సెలవులు ప్రకటించేశారు.పదో తరగతి ఇంటర్ పరీక్షలు రద్దు చేసే ఆలోచన లో  ఉన్నారు.ఇక ఎక్కడెక్కడ చిన్న చిన్న పట్టణాలు,  పల్లెల్లోనూ ఎవరికివారు సొంతంగా స్వీయ నియంత్రణ పాటించే నిమిత్తం వ్యాపార సముదాయాలను నిర్ణీత సమయానికి మూసివేయాలని నిబంధనలు విధించు కుంటున్నారు.

సినిమా హాళ్లుు, పర్యాటక ప్రదేశాలు , ప్రైవేటు కార్యాలయాలు , ఇలా అన్నింటి పైన ఆంక్షలు మొదలు కాబోతున్నాయి.దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు స్వీయ నియంత్రణ   దిశగా అడుగులు వేస్తున్నాయి.

దీనికోసం అనధికారికంగా నే లాక్ డౌన్ నిబంధనలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ విజృంభణ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో లాక్ డౌన్  అనధికారికంగా అమలుచేసి కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

మాస్కులు ధరించినవారికి భారీగా ఫైన్ లు విధిస్తూ, ఈ వైరస్ తీవ్రతను ప్రజలకు అర్థమయ్యే విధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు మరింత కఠినం చేశాయి.ఏది ఏమైనా మరోసారి విజృంభిస్తున్న ఈ కరోనా ను ఎవరికి వారే స్వీయ నిబంధనలు పాటించి కట్టడి చేయాలని విషయాన్ని ప్రభుత్వాలు అన్ని మార్గాల ద్వారా తెలియజేస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube