ఇండియా - శ్రీలంక సిరీస్ కు లైన్ క్లియర్..!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియా, శ్రీలంక క్రికెట్ మ్యాచ్ మొదలు కానుంది.శ్రీలంక టీమ్ ఇంగ్లండ్ నుంచి తమ స్వదేశానికి రావడంతో ఇండియా, శ్రీలంక మ్యాచ్ జరగనుంది.

 All Sri Lanka Cricket Players Tested Negative In Rtpcr Test And Ready To Play Wi-TeluguStop.com

మ్యాచ్ ఆడటానికి ముందుగా ఇంగ్లండ్ నుంచి వచ్చిన శ్రీలంక జట్టు సభ్యులకు కరోనా పరీక్ష చేయించారు.అందులో అందరికీ నెగటివ్ రావడంతో మ్యాచ్ జరగనుంది.

అదేవిధంగా సీనియర్ ఆటగాళ్లు అయిన కుసాల్ పెరీరా, దుష్మంత్ చమీరా, ధనుంజయ్ డిసిల్వా లకు కూడా కరోనా టెస్ట్ చేయగా నెగిటివ్ వచ్చింది.ఇంగ్లండ్ నుంచి వచ్చిన వీరు వారం రోజుల పాటు క్వారంటైన్ లో ఉన్నారు.

సోమవారం నుంచి వీరు బయో బబుల్‌లోకి ప్రవేశిస్తారు.ఈ విషయాన్ని శ్రీలంక బోర్డు తెలియజేసింది.

అలాగే జులై 13వ తేది నుంచి ప్రారంభం అయ్యే వన్డే సిరీస్ కూడా జులై 18వ తేది నుంచి ప్రారంభం కానుంది.అయితే బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్, డేలా అనలిస్ట్ జీటీ నిరోషన్‌ కోవిడ్ టెస్టు చేసిన తరువాత జట్టుతో కలుస్తారని శ్రీలంక క్రికెట్ బొర్డు తెలియజేసింది.

ఈ సందర్భంగా ఎస్‌ఎల్‌సీ అధికారి మీడియాతో మాట్లాడారు.అనుకున్న విధంగా ఫలితాలు వస్తే ప్రకటిస్తామన్నారు.క్రీడాకారులకు ఇంకో రౌండ్ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసినట్లు తెలిపారు.ఫలితాలు సానుకూలంగా వచ్చిన తర్వాత తాము అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలిపారు.

శ్రీలంక క్రీడాకారులంతా కూడా ప్రస్తుతం బాగానే ఉన్నారని, సోమవారం నుంచి బయో బబుల్‌లోకి వారు వెళ్లనున్నట్లు తెలియజేశారు.

Telugu Cricket, Indiasrilanka, Rtpcr, Ups, Sri Lanka, Srilanka-Latest News - Tel

వారి కోసం షెడ్యూల్ ను కూడా సవరించినట్లు తెలిపారు.శ్రీలంక లోని టీమిండియా సింహాళ స్పోర్ట్స్ క్లబ్ (ఎస్ఎస్‌సీ) గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తోందని, శ్రీలంక క్రికెటర్లు కూడా ఆర్ ప్రేమదాస స్డేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది.అన్నీ అనుకూలంగా ఉంటే సోమవారం నుంటే క్రీడాకారులు బయో బబుల్‌లోకి వెళ్లి మ్యాచ్ లు ఆడనున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు తెలియజేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube