బిగ్ బాస్ సీజన్ 6లో వారికి కూడా అవకాశం.. అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే?

తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ రియాల్టీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇతర భాషలతో పాటు తెలుగులో కూడా ఈ బిగ్ బాస్ షో విజయవంతం అయ్యింది.

 All Set For Telugu Bigg Boss Season 6 Date Announcement Details, Bigg Boss, Big-TeluguStop.com

అంతే కాకుండా ఇతర రియాలిటీ షోలతో పోలిస్తే ఈ షో భారీగా క్రేజ్ ను తెచ్చుకుంది.ఇప్పటికే తెలుగులో 5 సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.

అయితే ఈసారి కథ సరికొత్తగా బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ ప్రసారం అవుతున్న ఈ షో మొదట్లో అంతగా ఆకట్టుకోలేక పోయినప్పటికీ ప్రస్తుతం బాగానే ప్రేక్షకులను అలరిస్తోంది.

ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ షో కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే బిగ్ బాస్ సీజన్ 6 ను త్వరలోనే మొదలుపెట్టాలని బిగ్ బాస్ షో నిర్వాహకులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.అంతేకాకుండా ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 6 ని ప్రసారం చేయడానికి సిద్ధం కూడా అవుతున్నారని తెలుస్తోంది.

అయితే ప్రతి ఏడాది జరిగే దానికంటే బిగ్ బాస్ 6 వ సీజన్ ను కాస్త ముందుగానే ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అంతేకాకుండా ఈసారి ప్రసారమయ్యే బిగ్ బాస్ షోలో అనేక మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలతో పాటు గా ఒకరు ఇద్దరు కామన్ పీపుల్ కి ఇచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది.

Telugu Bigg Boss, Common, Disney Hot, Nagarjuna-Movie

అయితే గతంలో కూడా ఇలాగే కొంతమంది కామన్ పీపుల్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.కానీ వారు సత్తాను చాట లేకపోయాడు.మరి ఈసారైనా కామన్ మ్యాన్ సెలబ్రిటీలను ఓడించి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలుస్తారు లేదో చూడాలి మరి.అయితే ఇందుకు సంబంధించిన ప్రకటన నేడు ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.తెలుగు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ ఒక అధికారిక ప్రకటన చేయాల్సి ఉందని పేర్కొనడంతో, అది ఈ బిగ్ బాస్ సీజన్ కు సంబంధించిన వార్త అని ప్రచారాలు కొనసాగుతున్నాయి.మరి ఈ వార్తల్లో నిజా నిజాలు తేలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube