ఐపీఎల్‌లో కీలక మ్యాచ్‌లు.. మారిన నిబంధనలు

ఐపీఎల్‌లో లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాయి.70 లీగ్ మ్యాచ్‌లు పూర్తైన తర్వాత నాలుగు జట్లు టైటిల్ వేటలో ఉన్నాయి.వచ్చే ఆదివారం మే 29న ఒక జట్టు ఛాంపియన్‌గా అవతరించనుంది.ఇప్పటికే ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల పోరాటం లీగ్ దశలోనే ముగిసి పోయింది.

 All Set For Ipl 2022 Eliminator Matches These Are The New Rules Details, Ipl, Sports Teams, Sports Update, News Latest, New Ruled, Ipl 2022 New Rules, Super Over, Rcb, Lucknow Super Giants, Gujarat Titans, Rajasthan Royals, Ipl 2022 Final-TeluguStop.com

ఈ సారి గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు వరుసగా తొలి నాలుగు స్థానాలతో ప్లేఆఫ్‌కు చేరాయి.ఈ నాలుగింటిలో ఇప్పటి వరకు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఏకైక జట్టు రాజస్థాన్‌ మాత్రమే.

ఐపీఎల్ తాజా మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం, ప్లేఆఫ్‌లకు అంతరాయం ఏర్పడినా క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2, ఫైనల్‌లో విజేతలుగా తేలేలా సూపర్ ఓవర్ నిర్వహించనున్నారు.ఐపీఎల్ 2022 చివరి రెండు మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.

 All Set For Ipl 2022 Eliminator Matches These Are The New Rules Details, Ipl, Sports Teams, Sports Update, News Latest, New Ruled, Ipl 2022 New Rules, Super Over, Rcb, Lucknow Super Giants, Gujarat Titans, Rajasthan Royals, Ipl 2022 Final-ఐపీఎల్‌లో కీలక మ్యాచ్‌లు.. మారిన నిబంధనలు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఐపీఎల్ 2022 ప్లేఆఫ్‌ల పోరులో వర్షం వల్ల మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడితే, ఏదైనా జట్టును విజేతగా నిలిపేందుకు కొన్ని మార్గదర్శకాలను ఐపీఎల్ యాజమాన్యం ప్రకటించింది.ప్లే ఆఫ్ మ్యాచ్‌లలో మ్యాచ్ జరిగే సమయానికి విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ నిర్వహిస్తారు.

ఆరు బంతుల్లో ఇరు జట్లల ఏ జట్టు అత్యధిక పరుగులు చేసిందే దానినే విజేతగా నిలుస్తుంది.బాగా వర్షం పడి ఒక్క ఓవర్ కూడా వేయడం వీలు పడకపోతే పాయింట్ల టేబుల్‌లో ఆయా జట్లు సాధించిన పాయింట్ల ప్రకారం మ్యాచ్ విజేతను నిర్ణయిస్తారు.

ఈ ప్రకారం ప్రస్తుతం గుజరాత్‌కు ఈ పరిస్థితి వస్తే అది మ్యాచ్‌ ఆడకుండానే ఫైనల్ చేరుతుంది.ఇదే నిబంధనను ఎలిమినేటర్ మ్యాచ్‌కు కూడా వర్తింపజేయనున్నారు.

Telugu Gujarat Titans, Ipl Final, Ipl, Lucknow, Ruled, Latest, Teams-Latest News - Telugu

ఐపీఎల్ 2022లో మొదటి క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచ్లను కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ మైదానంలో మంగళ, బుధ వారాల్లో నిర్వహించనున్నారు.ప్రస్తుతం అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ ప్రభావం మ్యాచ్ జరిగే స్టేడియంపై కూడా పడింది.స్టేడియంలో మీడియాకు కేటాయించి ప్రెస్ బాక్స్ నామరూపాలు లేకుండా పోయింది.దీంతో ఈ కొత్త నిబంధనలను అమలు లోకి తీసుకొచ్చారు.

సూపర్ ఓవర్ అంటే ఏమిటి?

ఒక సూపర్ ఓవర్‌లో ప్రతి జట్టు ఆరు బంతుల ఓవర్‌ను ఎదుర్కొంటుంది.కోల్పోయిన వికెట్ల సంఖ్యతో సంబంధం లేకుండా ఎక్కువ సంఖ్యలో పరుగులు చేసిన జట్టు విజేతగా ఉంటుంది.ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోవడంతో జట్టు ఒక ఓవర్ ఇన్నింగ్స్ ముగుస్తుంది.

టైడ్ సూపర్ ఓవర్ అంటే సూపర్ ఓవర్ విధానాన్ని పునరావృతం చేస్తారు.సూపర్ ఓవర్ టై అయితే, విజేతగా ఏదో జట్టు నిలిచే వరకు మరో సూపర్ ఓవర్ నిర్వహిస్తారు.

సాధారణ పరిస్థితుల్లో మునుపటి సూపర్ ఓవర్ ముగిసిన 5 నిమిషాల తర్వాత ఏదైనా తదుపరి సూపర్ ఓవర్ ప్రారంభమవుతుంది.

Telugu Gujarat Titans, Ipl Final, Ipl, Lucknow, Ruled, Latest, Teams-Latest News - Telugu

మునుపటి సూపర్ ఓవర్‌లో రెండో బ్యాటింగ్ చేసిన జట్టు తదుపరి సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేస్తుంది.మునుపటి సూపర్ ఓవర్‌లో ప్రతి జట్టు ఉపయోగించేందుకు ఎంచుకున్న బంతులను అదే జట్టు తదుపరి సూపర్ ఓవర్(ల)లో మళ్లీ ఉపయోగించాలి.ఫీల్డింగ్ జట్టు మునుపటి సూపర్ ఓవర్‌లో బౌలింగ్ చేసిన వ్యతిరేక ఎండ్ నుండి తదుపరి సూపర్ ఓవర్‌లో తన ఓవర్‌ను తప్పనిసరిగా బౌల్ చేయాలి.

ఏదైనా మునుపటి సూపర్ ఓవర్‌లో అవుట్ చేయబడిన ఏదైనా బ్యాటర్ తదుపరి సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్ చేయడానికి అనర్హుడవుతాడు.మునుపటి సూపర్ ఓవర్‌లో బౌలింగ్ చేసిన ఏ బౌలర్ అయినా తదుపరి సూపర్ ఓవర్‌లో బౌలింగ్ చేయడానికి అనర్హుడవుతాడు.

అన్ని ఇతర మార్గాల్లో, తదుపరి సూపర్ ఓవర్ ప్రక్రియ ప్రారంభ సూపర్ ఓవర్ మాదిరిగానే ఉంటుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube