జైల్లో అందరికి ఎలా అయితే చిదంబరంకు అలాగే

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు చిదంబరం ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్ట్‌ అయ్యి ప్రస్తుతం తీహార్‌ జైల్లో ఉన్న విషయం తెల్సిందే.విచారణ నిమిత్తం కష్టడీకి తీసుకున్న ఎంక్వౌరీ అధికారులు ఆయన్ను తీహార్‌ జైల్లో ఉంచారు.

 All Prisionssame In Jailsame Treatmentfor Chidambaram Bjp-TeluguStop.com

ఇక తీహార్‌ జైల్లో చిదంబరంకు ప్రత్యేక వసతులు కావాలంటూ కోర్టులో పిటీషన్‌ దాఖలు అవ్వగా అందుకు నో చెప్పారు.ఇక తాజాగా ఆయనకు ఇచ్చే ఫుడ్‌ అయినా ప్రత్యేకంగా ఉండాలి అంటూ చిదంబరం తరపు న్యాయవాది కోర్టును ఆశ్రయించాడు.

దీనికి కూడా కోర్టు నో చెప్పింది.

తాజాగా కోర్టులో వాదనలు వినిపించిన చిదంబరం తరపు న్యాయవాది మాట్లాడుతూ ప్రస్తుతం చిదంబరం వయసు 74 ఏళ్లు.

ఆయన్ను ఈ వయసులో ప్రత్యేక ఆహారం తీసుకోవాల్సిందిగా వైధ్యులు సూచించారు.అందుకే మీరు అనుమతించాలంటూ కోర్టులో వేడుకోవడం జరిగింది.అందుకు కోర్టు తిరష్కరించింది.జైల్లో అంతా సమానంగానే చూడాలని, ప్రత్యేకంగా చిదంబరంను చూడాల్సిన అవసరం ఏమీ లేదు అంటూ కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube