గ్రేటర్ లో టెన్షన్ పెడుతున్న టీడీపీ ? పొత్తు కోసం ఎత్తులు ?

మరికొద్ది రోజుల్లోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబో పోతున్న నేపథ్యంలో, అన్ని పార్టీలు ఈ ఎన్నికలపై టెన్షన్ పడుతున్నాయి.ఇక్కడ ఏదో రకంగా గెలుపు తమ ఖాతాలో వేసుకోవాలని అధికార పార్టీ టిఆర్ఎస్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.

 All Political Parties Tension On Tdp Decision About Ghmc Elections-TeluguStop.com

గ్రేటర్ ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుండగా, ఇటీవల దుబ్బాక లో గెలిచిన ఆనందంలో ఉన్న బిజెపి అంతే ఊపు తో గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నాయి.ఇక గ్రేటర్లో తమ బలం నిరూపించుకుని, సత్తా చాటాలని కాంగ్రెస్ సైతం గట్టిగా ప్రయత్నం చేస్తుండగా , ఇక్కడ పెద్ద బలం లేదని , ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని అంతా తెలుగుదేశం పార్టీ గురించి అభిప్రాయపడుతుండగా, ఆ పార్టీ ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు సిద్ధం అవుతుండడం అన్ని పార్టీలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఇక్కడ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా, గ్రేటర్ లో టిడిపి కి కాస్తోకూస్తో బలం ఉండడం,  చాలా డివిజన్లలో ఈ మధ్యకాలంలో పట్టు పెరిగినట్టుగా కనిపించడం , ఇతర పార్టీలకు సీటు దక్కే అవకాశం లేదు అనుకున్న వారు, ఇప్పుడు టిడిపి వైపు చూస్తూ,  ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండటం వంటి కారణాలతో తెలుగుదేశం పార్టీలను వచ్చినట్లుగా కనిపిస్తోంది.ప్రస్తుతానికి తెలంగాణ టిడిపి అధ్యక్షుడు రమణ పెద్దగా పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించనప్పటికీ గ్రేటర్ లో టీడీపీ కి నమోదయ్యే ఓట్లు గెలుపును ప్రభావితం చేసే స్థాయిలో ఉండటంతో అన్ని పార్టీలు టెన్షన్ పడుతున్నాయి.

 All Political Parties Tension On Tdp Decision About Ghmc Elections-గ్రేటర్ లో టెన్షన్ పెడుతున్న టీడీపీ పొత్తు కోసం ఎత్తులు -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీనికితోడు అధికార పార్టీ టిఆర్ఎస్ కు ప్రజావ్యతిరేకత ఉన్నట్టుగా కనిపిస్తుండటం వంటి కారణాలతో, టిడిపికి సింగిల్ డిజిట్ లో అయినా గ్రేటర్ లో కొన్ని సీట్లను గెలుచుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే టీడీపీ మాత్రం ఇక్కడ బీజేపీకి మద్దతు ఇవ్వాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోంది.బిజెపి సైతం టిడిపితో లోపాయికారిగా ఒప్పందం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ చోటు చేసుకుంటున్న రాజకీయ సమీకరణాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.గ్రేటర్ లో బీజేపీకి మద్దతు ఇవ్వడం ద్వారా, ఏపీలో తమకు ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు అనే ఆలోచనతో బాబు ఉన్నట్టు గా కనిపిస్తున్నారు.

ఇక్కడ టీడీపీకి బలం లేకపోయినా, మిగతా రాజకీయ పార్టీలను భయపెట్టే స్థాయిలో ఉండగలగడం ఆ పార్టీ ప్రాధాన్యత ను పెంచుతున్నట్లు గా కనిపిస్తోంది.

#Aliance #GHMC #Telangana TDP #Ramana #Chandrababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు