ఎవరూ తగ్గట్లే ... హీటెక్కుతున్న హుజురాబాద్ ?

హుజురాబాద్ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసినా, ఇక్కడ మాత్రం ఎన్నికల వేడి కొనసాగుతూనే ఉంది.అధికార పార్టీ టిఆర్ఎస్ ఇక్కడ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళుతోంది.

 All Political Parties Are Focussed On Huzurabad Constituency, Hujurabad, Trs, Kc-TeluguStop.com

దీంతో పాటు , ఎన్నో సంక్షేమ పథకాలను ఈ నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తోంది.ఎమ్మెల్యేలు, ఎంపీలు ,నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల నాయకులు ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టారు.

గ్రామానికి ఒక  ఇన్చార్జిని నియమించారు.అలాగే మండలాల వారీగా ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు.

ఎక్కడా ప్రజలలో అసంతృప్తి తలెత్తకుండా వారు అన్ని ఏర్పాట్లు టీఆర్ఎస్ చేసింది.

గడపగడపకు ఓటర్లను కలిసే విధంగా నాయకులకు బాధ్యతలు అప్పగించింది.

ఈ వ్యవహారాల అన్నింటిని తెలంగాణ మంత్రి హరీష్ రావు చూస్తున్నారు.ఇక కాంగ్రెస్ ,బిజెపి సైతం ఈ నియోజకవర్గంలో గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.

టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజల్లో అసంతృప్తి ని హైలెట్ గా చేసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి.గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నిటిని ప్రస్తావిస్తూ, వాటిని ఇంకా అమలు చేయలేదని ఎద్దేవా చేస్తూ, ప్రజల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచే విధంగా చేస్తున్నారు.

ఇక ఈ సందర్భంగా బీజేపీ కాంగ్రెస్ నేతలకు టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బంధు పథకం పై ఈటెల రాజేందర్ వంటివారు విమర్శలు చేస్తుండడంతో దానిని తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

Telugu Dalithagirijana, Etela Rajender, Hareesh Rao, Hujurabad, Huzurabad, Revan

రైతు బంధు పై ఈటెల రాజేందర్ విమర్శలు చేస్తున్నారని ఆయన రైతు బంధు ఎందుకు తీసుకున్నారు అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి వారు ప్రశ్నిస్తున్నారు.
  ఇక రేవంత్ రెడ్డి సైతం దళిత బంధు పథకానికి పోటీగా ఆయన గిరిజన దళిత దండోరా సభను నిర్వహించారు.ఇంకా అనేక సభలు ,సమావేశాలు నిర్వహించి టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.ఇలా అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలతో హుజూరాబాద్ నియోజకవర్గం నిత్యం వార్తల్లో ఉంటోంది.

   

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube