జైల్లో ఉన్నప్పుడు నా డబ్బంతా దొబ్బెశారు.. ఫన్ బకెట్ భార్గవ్ కన్నీటిగాధ?

సోషల్ మీడియా ద్వారా అతి తక్కువ సమయంలో మంచి సెలబ్రిటీ హోదాను అందుకున్న ఫన్ బకెట్ భార్గవ్ అంతే త్వరగా తన కెరీర్ ను నాశనం చేసుకున్న సంగతి తెలిసిందే.గతంలో ఇతడు ఓ మైనర్ బాలికను లొంగదీసుకొని ఆమెను గర్భవతిని చేసిన విషయం బయటపడటంతో అతనిని పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు.

 All My Money Was Wasted While In Jail Fun Bucket Bhargav Tears-TeluguStop.com

ఇక ఇప్పటికే ఇతనిపై కేసు విచారణలో ఉండగా తాజాగా బెయిల్ పై బయటకు వచ్చినట్లు తెలుస్తుంది.

సోషల్ మీడియాలో టిక్ టాక్ వీడియోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు భార్గవ్.

 All My Money Was Wasted While In Jail Fun Bucket Bhargav Tears-జైల్లో ఉన్నప్పుడు నా డబ్బంతా దొబ్బెశారు.. ఫన్ బకెట్ భార్గవ్ కన్నీటిగాధ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

యూట్యూబ్ లో ఫన్ బకెట్ పేరుతో కొంతమంది అమ్మాయిలతో కలిసి వీడియోలు కూడా చేశాడు.అతి తక్కువ సమయంలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.కానీ టిక్ టాక్ లో పరిచయమైన 14 ఏళ్ల బాలికకు తనకు ఆఫర్లు ఇస్తానని మరింత పేరు అందిస్తానని చెప్పి నమ్మించాడు.ఆమెను ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేశాడు.

కానీ ఆ అమ్మాయి నో అనడంతో చెల్లి అని పిలిచేవాడు భార్గవ్.

అలా తను బట్టలు మార్చుకుంటున్న సమయంలో వీడియోలు తీసి ఈ వీడియోలను బయట పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేసి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.అంతేకాకుండా పలుమార్లు తనను శారీరకంగా వేధించి గర్భవతిని చేశాడు.దీంతో ఈ విషయం బయటపడటంతో అతడిపై దిశ, ఫోక్సో చట్టం కింద కేసు నమోదయ్యింది.

అలా కొన్ని రోజులు జైల్లో ఉన్న అతడు ఇటీవల బయటకు రాగా మళ్లీ పోస్ట్ చేశాడు.దీంతో అతడిపై నెటిజనులు మరింత దారుణంగా ఫైర్ అవుతున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో షేర్ చేశాడు.అందులో ‘ఇది నా కథ’ అంటూ కొన్ని విషయాలు మాట్లాడాడు.అందులో కాస్త ఎమోషనల్ గా కనిపించాడు భార్గవ్.ఇక తనపై వచ్చిన ఆరోపణల గురించి క్లారిటీ ఇవ్వాలన్న కూడా ప్రస్తుతం ఆ కేసు కోర్టులో ఉందని ఏమి మాట్లాడలేకపోతున్నానని తెలిపాడు.ఇక తను నెలకి రూ.8 లక్షలు సంపాదించిన కూడా డబ్బులు దాచుకోలేకపోయాడట.

తన స్నేహితులు తనని మోసం చేశారని.తాను దాచుకున్న 12 లక్షలు తన అకౌంట్ నుండి డ్రా చేశారని తెలిపాడు.తాను జైల్లో ఉన్నప్పుడు తన డబ్బంతా దొబ్బేశారని.తను బయటకి వచ్చేసరికి తన జాబ్స్ అన్ని పోయాయని ఎమోషనల్ అయ్యాడు.ఇక తను కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నానని.ఈ ప్రయాణంలో తనను అందరూ ప్రోత్సహించాలని కోరాడు.

ఈ కంటెంట్ నచ్చకపోతే చెప్పండి కానీ నెగటివ్ కామెంట్స్ మాత్రం చేయొద్దని కోరాడు.కానీ నెటిజన్లు మాత్రం అతడిపై ఓ రేంజ్ లో మండిపడుతున్నారు.

ప్రస్తుతం అతడు షేర్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

#Bucket Bhargav #Lost Jobs #Drawn Rupees #Andhra #Comments

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు