నీట్ పరీక్షలో ఆలిండియా మొదటి ర్యాంక్ సాధించిన ఏపీ విద్యార్థి.. ఇతని సక్సెస్ సీక్రెట్స్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

నీట్ పరీక్ష( NEET )లో ర్యాంక్ సాధించడమే కష్టం కాగా ఆలిండియా స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించడం ఎంతో కష్టమనే సంగతి తెలిసిందే.అయితే ఈ అసాధ్యాన్ని ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన విద్యార్థి ఎంతో కష్టపడి సుసాధ్యం చేశారు.

 All India Topper Varun Inspirational Success Story Details Here Goes Viral In S-TeluguStop.com

ఈ విద్యార్థి పేరు వరుణ్ చక్రవర్తి( Varun Chakaravarthy) కాగా మంచి ర్యాంక్ వస్తుందని ముందే ఊహించానని వరుణ్ కామెంట్లు చేశారు.నీట్ పరీక్షలో 720 మార్కులు వచ్చాయని వరుణ్ వెల్లడించారు.

రెండేళ్లు తీవ్రంగా శ్రమించడం వల్లే ఈ ర్యాంక్ సాధించడం సాధ్యమైందని వరుణ్ తెలిపారు.పదో తరగతిలో మ్యాథ్స్ చేయడం ఇబ్బందిగా అనిపించి బయాలజీపై దృష్టి పెట్టానని మొదటి నుంచి కోచింగ్ తీసుకోవడం వల్ల లక్ష్యాన్ని సాధించడం సులువుగానే సాధ్యమైందని వరుణ్ కామెంట్లు చేశారు.

ఒకవైపు స్టేట్ సిలబస్ చదువుతూనే మరోవైపు ఎన్సీఈఆర్టీ బుక్స్ చదివానని వరుణ్ వెల్లడించారు.

తప్పు జవాబులు రాసిన వాటిని ఎర్రర్ బుక్ లో రాసుకుని ఆ తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్త పడ్డానని వరుణ్ పేర్కొన్నారు.నీట్ లో థియరీ బేస్డ్ ప్రశ్నలు ఎక్కువగా వస్తుండటంతో వాటికి అనుగుణంగా ప్రిపరేషన్ ను కొనసాగించానని వరుణ్ కామెంట్లు చేశారు.స్టాండర్డ్ బుక్స్ చదవడం అలవాటు చేసుకుంటే కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం సాధ్యమవుతుందని వరుణ్ కామెంట్లు చేశారు.

బయాలజీ( Biology )కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ చదివానని వరుణ్ కామెంట్లు చేశారు.ప్రశ్న చదవడంలో పొరపాటు చేయకూడదని ప్రిపరేషన్ సమయంలో మొబైల్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని వరుణ్ వెల్లడించారు.గ్రూప్ స్టడీ, హెల్తీ కాంపిటీషన్ వల్ల సులువుగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందని వరుణ్ అన్నారు.వరుణ్ పూర్తి పేరు బోరా వరుణ్ చక్రవర్తి కాగా రాబోయే రోజుల్లో వరుణ్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube