వరాలు... విమర్శలు : ఖమ్మం సభలో రాహుల్ ఇలా అన్నారు

ఈ రోజు ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ సభలో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రజలకు వరాల జల్లులు కురిపిస్తూనే… తమ రాజకీయ ప్రత్యర్థులపై విమర్శల తూటాలు వదిలారు.కేసీఆర్ ఎన్ని కుతంత్రాలు చేసినా సరే … కూటమి చేతిలో టీఆర్ఎస్ ఓడడం ఖాయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

 All India Congress President Rahul Gandhi Campaign In Khammam-TeluguStop.com

అంతే కాదు … ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ గెలవాలంటూ… టీఆర్ఎస్ పార్టీతో పాటు … ఎంఐఎం లు బలంగా కోరుకుంటున్నాయి అంటూ విమర్శలు చేశారు.ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా … ప్రారంభించిన మిషన్ భగీరధ పైన కూడా సంచలన వ్యాఖ్యలు చేసాడు.

పాత వాటర్ ట్యాంకర్ లకే రంగులేసి మిషన్ భగీరథ అంటున్నారని.ప్రాణహిత చేవేళ్ల ను కాళేశ్వరంగా మార్చి వేల కోట్ల రూపాయలను ఆదనంగా ఖర్చు చేశారని దుయ్యబట్టారు.ఇక ఈ విమర్శలు గురించి పక్కన పెట్టి రాహుల్ వరాల గురించి మాట్లాడుకుంటే… ప్రజాకూటమి అధికారంలోకి వస్తే ప్రతి మండలానికి ఒక 30 పడకల ఆసుపత్రి కట్టిస్తామని… డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తామని… నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఏర్పాటు చేసతామంటూ రాహుల్ తన ప్రసంగంలో ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube