మొత్తానికి రేవంత్‌కు అలా మ‌ద్ద‌తిస్తున్న కోమ‌టిరెడ్డి.. కండీష‌న్ మాత్రం కామ‌నే

కాంగ్రెస్‌లో ఇంటి పోరు అనేది అనాదిగా వ‌స్తున్న ఆచారంలా ఇప్పటికీ కొన‌సాగుతూనే ఉంది.ఇదికాస్త రేవంత్‌రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా ప్ర‌క‌టించ‌డంతో చాలా తీవ్రంగా క‌నిపించింది.

 All In All, Komantireddy Is Supporting Rewanth Like That But The Condition Is Th-TeluguStop.com

ఎంత‌లా అంటే ఏకంగా కొంద‌రు సీనియ‌ర్లు రాజీనామా చేసేదాకా వెళ్లింది.ఇంకొంద‌రేమో త‌మ‌ను క‌ల‌వొద్దంటూ రేవంత్‌కు అల్టిమేటం జారీ చేసే వర‌కు వెళ్లిందంటే ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు.

ఇక కోమ‌టిరెడ్డి సోద‌రులు అయితే రేవంత్‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తూనే వ‌స్తున్నారు.రేవంత్‌తో ఇప్ప‌టి వ‌ర‌కు మాట్లాడేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపించ‌లేదు.

అయితే ఇప్పుడు వారిలో కొంత మార్పు వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది.

రీసెంట్‌గా రేవంత్ నాయ‌క‌త్వంలో ద‌ళిత‌, గిరిజ‌న దండోరా స‌భ‌లు నిర్వ‌హిస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.

ఇక మొద‌టి స‌భ‌ను ఇంద్ర‌వెల్లి వేదిక‌గా నిర్వ‌హించిన రేవంత్ రెండో స‌భ‌ను ఇబ్ర‌హీంప‌ట్నంలో నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఇక ఈ స‌భ నిర్వ‌హించే ప్లేస్ కాస్త భువ‌న‌గిరి పార్ల‌మెంట్ ప‌రిధిలోకి వ‌స్తోంది.

దీంతో ఇక్క‌డ ఎంపీగా ఉన్న కోమ‌టిరెడ్డి స్పందించారు.ఇక రేవంత్‌తో దీనిపై మాట్లాడేందుకు ఫోన్ కూడా చేసి చ‌ర్చించారు.

అయితే తాను స‌భ‌కు రావ‌డానికి సిద్ధ‌మేన‌ని కూడా ప్ర‌క‌టించారు.

Telugu Congress, Indravelli, Komanti, Komanti Rewanth, Revanth-Telugu Political

కాక‌పోతే ఇక్క‌డే చిన్న కండీష‌న్ పెట్టారు.స‌భ‌ను ఈ నెల 18న నిర్వ‌హిస్తే తాను రాలేన‌ని, ఎందుకంటే పార్ల‌మెంట్ స‌మావేశాలు ఉన్నందున డేట్‌ను మార్చుకోవాల‌ని సూచించార‌.21 లేదా ఆ త‌ర్వాత ఎప్పుడు స‌భ నిర్వ‌హించినా తాను వ‌చ్చేందుకు రెడీ అంటూ సంకేతాలు కూడా ఇచ్చేశారు.దీంతో ఇప్పుడు కాంగ్రెస్‌లో శ్రేణుల్లో మ‌రింత జోష్ వ‌చ్చింది.ఇద్ద‌రు అగ్ర నేత‌లు మ‌ళ్లీ ఒకే వేదిక‌పై క‌నిపిస్తే ఆ జోష్ వేరే లెవ‌ల్‌లో ఉంటుంద‌ని అంతా భావిస్తున్నారు.

మ‌రి కోమ‌టి సూచ‌న మేర‌కు డేట్‌ను మార్చుకుంటారా లేదా అన్న‌ది మాత్రం వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube