సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు మూడు పదుల వయసు దాటినా కూడా పెళ్లి చేసుకోకుండా ఇంకా కెరిర్ అంటూ సినిమాలు చేస్తూ వెళుతూ ఉంటారు.ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో నాలుగు పదుల వయసు దాటినా కూడా పెళ్లి చేసుకొని వారు చాలా మందే ఉన్నారు.
ఇకపోతే ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలోని పలువురు సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు పెళ్లిపీటలు ఎక్కుతున్నారు.మరీ ముఖ్యంగా అయితే బాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది అని చెప్పవచ్చు.
ఇప్పటికే పలువురు హీరోయిన్ లు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
ఇటీవల ఆలియా భట్,రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకుంది.
ఇదిలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం మరొక హీరోయిన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది.ఆమె మరెవరో కాదు సోనాక్షి సిన్హా.సోనాక్షి సిన్హా పెళ్లికి సిద్ధమయ్యింది.తాజాగా ఆమె ఎంగేజ్మెంట్ కార్యక్రమం కూడా అయిపోయింది.
ఎంగేజ్మెంట్ అయిన సందర్భంగా ఆమె ఉంగరాన్ని చూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.కానీ ఆ ఫోటోలో తనకు కాబోయే భర్త ను మాత్రం చూపించలేదు.
ఆమె భర్త ఎవరు అన్న విషయాన్ని సస్పెన్స్ గా ఉంచింది.ఈ సందర్భంగా ఆమె ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది.
నాకు ఇది చాలా పెద్ద రోజు.నా అతి పెద్ద కోరిక నెరవేరిన రోజు.ఇది మీతో షేర్ చేయకుండా ఉండలేకపోతున్నాను.ఇంత ఈజీగా ఇది అయిపోతుందని కూడా అనుకోలేదు అంటూ తన ఎంగేజ్ మెంట్ మేటర్ ను బయటపెట్టింది సోనాక్షి.ఆమె షేర్ చేసిన ఫోటోలలో ఆమె చేతికి డైమండ్ రింగ్ మెరిసిపోతోంది.అయితే గత కొన్నాళ్లుగా ఈమె నటుడు జహీర్ ఇక్బాల్ తో డేటింగ్ లో ఉంది అన్న విషయం తెలిసిందే.
ఇక అతడినే పెళ్లి చేసుకోబోతోంది.అంతే కాకుండా మరో ముఖ్యమైన సందర్భం చూసుకొని, అతడితో ఎంగేజ్ మెంట్ పూర్తయిందనే విషయాన్ని ఆమె బయటపెట్టబోతోంది ఈ ముద్దుగుమ్మ.