కష్టాల సునామి రాబోతోందా ? జగన్ ఎలా తట్టుకుంటాడో ?  

All Ap Parties Are Focus On Ys Jagan Mohan Reddy -

ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చి రాగానే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలుచేసే బాధ్యతలను తీసుకున్నాడు.ప్రజల సంక్షేమమే తమ ప్రథమ కర్తవ్యం అని నిరూపించుకునేందుకు జగన్ తాపత్రయపడుతున్నాడు.

All Ap Parties Are Focus On Ys Jagan Mohan Reddy

అయితే ఇప్పుడు పరిస్థితి అంతా సక్రమంగానే ఉన్నట్టే ఉన్నా రానున్న రోజుల్లో అవే పథకాలు జగన్ కు గుదిబండగా మారే అవాకాశాలు కనిపిస్తున్నాయి.అయితే జగన్ ప్రస్తుత ఆలోచన అంతా ప్రజల్లో జగన్ అంటే బెస్ట్ సీఎం అనే అభిప్రాయం ఉండాలనే.

అదే సమయంలో చంద్రబాబు, టీడీపీ పేరు ఏపీలో వినపడకుండా చేయడమే.ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా మరింత ముందుకు వెళ్లాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది.

కష్టాల సునామి రాబోతోందా జగన్ ఎలా తట్టుకుంటాడో -Political-Telugu Tollywood Photo Image

ఒకరకంగా చూసుకుంటే ముందు ముందు జగన్ ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉన్నట్టే కనిపిస్తోంది.

కొత్తగా అధికారంలోకి వచ్చాడు కాదా ఓ మూడు నెలల సమయం వేచి చూద్దాం అనే ధోరణిలో ఉంటూ వచ్చిన టీడీపీ అప్పటి వరకు వేచి చూడకుండా విమర్శల బాణాలు వదలడం మొదలుపెట్టింది.మరోవైపు చూస్తే తమతో డైరెక్ట్ గా పొత్తు పెట్టుకోకపోయినా మిత్ర పక్షంగా ఉన్న కేంద్ర అధికార పార్టీ బీజేపీ కూడా ఇప్పుడు వైసీపీ మీద విమర్శలు చేస్తూ వస్తోంది.జగన్ తన నవరత్నాల పథకం కాకుండా మిగతా చాలా పథకాలకు కేంద్ర నిధులు దోహదం చేస్తాయి అనే ఆలోచనతో ఉన్నాడు.

అయితే ప్రస్తుతం మారిన పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏపీకి సాయం చేస్తారో లేదో అనే సందేహం జగన్ తో పాటు అందరికి ఉంది.కేంద్రం కనుక జగన్ స్పీడుకు బ్రేకులు వేయాలని అనుకుంటే అది తప్పకుండా నిధుల విషయంలో ఇబ్బందులు పెట్టే ఛాన్సులే ఎక్కువ ఉన్నాయి.

ఈ నేపథ్యంలో జగన్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా తయారయ్యింది.కేంద్రం సహకారం అంతగా ఉండే అవకాశం లేని పరిస్థితుల్లో ప్రస్తుతం అమలు చేస్తున్న చేయబోతున్న పథకాలను ఎలా ముందుకు తీసుకు వెళ్తారో చూడాలి.మరోవైపు చూస్తే సామాజికపరంగా బలమైన కమ్మ సామాజికవర్గం అంతా వైసీపీని టార్గెట్ చేసుకుంది.సోషల్ మీడియాలోనూ జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం ముమ్మరంగా సాగిపోతోంది.కాపులకు అయిదు శాతం అగ్ర కులాల రిజర్వేషన్లో వాటా కోరిన ముద్రగడ పద్మనాభం జగన్ కు ఇప్పటికే లేఖ రాశారు.ఇపుడు జగన్ స్పందించకపోతే ఆయన ఉద్యమ బాట పట్టే అవకాశం ఉంది.

ఇలా అన్ని వైపులా నుంచి చూసుకుంటే జగన్ కు ముందున్నది కష్టకాలమే అన్నట్టుగా కనిపిస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు