అందరూ ఇంతేగా ? 'హోదా' సంగతి మరిచారుగా ?

రాజకీయ పార్టీలు వేరైనా రాజకీయ నాయకుల ఆలోచన మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది.వారికి కావాల్సింది వారి రాజకీయ ప్రయోజనాలు తప్ప మిగతా వేటి గురించి పెద్దగా ఆలోచించరు.

 All Ap Political Leaders Forgot The Ap Special Status-TeluguStop.com

ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రజల మద్దతు కోసం రాజకీయ పార్టీలు ఉద్యమిస్తాయి కానీ ఆ తర్వాత ఆ అంశాన్ని పక్కన పడేస్తారు.పూర్తిగా ఏపీలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల కంటే తమ ప్రయోజనాలు ముఖ్యంగా అన్నట్టుగా భావిస్తున్నాయి.

అందుకే రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా అంశాన్ని తమ స్వప్రయోజనాల కోసం అన్ని రాజకీయ పార్టీలు పూర్తిగా పక్కన పెట్టేసి తమకు అవసరం ఉన్నప్పుడు మాత్రం ఈ హోదా అంశాన్ని తెరమీదకు తీసుకు వస్తున్నాయి.

Telugu Ap, Apforgot, Apcm, Apseparate, Ap Status, Bjp Congress, Janasena Status-

ఇప్పుడైతే అన్నిరాజకీయ పార్టీలు ఈ విషయాన్ని మర్చిపోయాయి.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించిన సమయంలో ఆంధ్రప్రదేశ్ ను ఆదుకునేందుకు పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి అధికార పార్టీ కాంగ్రెస్ హామీ ఇచ్చింది.అయితే పదేళ్ల కాదు పదిహేనేళ్లు హోదా ఇవ్వాలంటూ అప్పట్లో బిజెపి గట్టిగా డిమాండ్ చేసింది.

కానీ బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత 15 ఏళ్లు కాదు కదా అసలు హోదానే ఇచ్చేందుకు ఇష్టపడటం లేదు.ఆ తరువాత ఈ అంశం రాజకీయంగా ఇబ్బందిగా మారడంతో హోదా కాదు ప్యాకేజీ ఇస్తామని చెప్పింది.

Telugu Ap, Apforgot, Apcm, Apseparate, Ap Status, Bjp Congress, Janasena Status-

విభజన కారణంగా నష్టపోయిన రాష్ట్రానికి అసలు హోదా కాదు కదా కనీసం ప్యాకేజీ ఇచ్చేందుకు కూడా ముందుకు రావడంలేదు బీజేపీ ప్రభుత్వం.మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్న వైసిపి ఇదే విషయంపై ఎన్నో ఆందోళనలు నిర్వహించింది.ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు ప్రజలకు వివరిస్తూ వైసిపి పోరాడింది.ఈ విషయంలో టిడిపి, బీజేపీతో సన్నిహితంగా ఉండడం వల్ల బాగా ఇబ్బందులు ఎదుర్కొంది.

ఆ తరువాత టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చేయడంతో ఈ అంశాన్ని మళ్లీ తెరమీదకు తీసుకు వచ్చింది.హోదా కోసం కేంద్రం మెడలు వంచాలంటే మాకు 25 ఎంపీ సీట్లలో నగ్గించాలంటూ వైసీపీ చెప్పింది.

ఎన్నికల్లో 22 ఎంపీ సీట్లు దక్కించుకుంది.కానీ ఎన్నికల సమయంలో బిజెపి వైసీపీకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడంతో ఇప్పుడు వైసిపి ఈ అంశాన్ని లేవనెత్తేందుకు వెనకడుగు వేస్తోంది.

బిజెపి ఆగ్రహానికి గురయితే ఆ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది జగన్ కు బాగా తెలుసు.అందుకే ఈ అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మొన్నటి వరకు హోదా కోసం గట్టిగా గొంత్తెతినా, ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకున్న కారణంగా ఆ అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినట్టే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube