అయ్యయ్యో జేబులకు చిల్లులు పడిపోతున్నాయే ?  

all ap party local leaders suffer from elections post poned - Telugu Ap Cm Jagan Mohan Reddy, Ap Elections, Ap Elections Post Pone, Ap Ycp Party, Jagan Mohan Reddy, Janasena And Tdp, Nimmagadda Ramesh Kumar, Ycp Leaders Comments On Ramesh Kumar

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడంతో అధికార పార్టీ వైసిపి పూర్తిగా డీలా పడిపోయింది.ఇప్పటికే చాలా చోట్ల ఏకగ్రీవాలతో జోష్ మీద ఉన్న వైసిపి స్థానిక సంస్థల ఎన్నికల్లో 90% స్థానాలు తామే సాధిస్తామని ఇప్పటి వరకు అయితే అంత స్మార్ట్ గా ఎన్నికల సంఘం కరోనా వైరస్ ను బూచిగా చూపించి ఎన్నికలను వాయిదా వేయడంతో అధికార పార్టీలో ఎక్కడలేని కంగారు మొదలైంది.

TeluguStop.com - All Ap Party Local Leaders Suffer From Elections Post Poned

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఇప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టులో కూడా ఇదే అంశం పై కేసు వేసేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది.అసలు చీఫ్ సెక్రటరీ కి కూడా తెలియకుండా రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఏ విధంగా ఎన్నికలను వాయిదా వేస్తారని వైసిపి ప్రశ్నిస్తోంది.

TeluguStop.com - అయ్యయ్యో జేబులకు చిల్లులు పడిపోతున్నాయే -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అంతేకాదు ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ ను వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది.ఇదిలా ఉంటే మరో ఆరు వారాల వరకు ఎన్నికలు జరిగే అవకాశం లేకపోవడంతో బరిలోకి దిగిన అభ్యర్థులు తీవ్రస్థాయిలో మదన పడుతున్నారు.మళ్లీ నోటిఫికేషన్ వచ్చే వరకు ఖర్చులు భరించాలి కాబట్టి అప్పటి వరకు ప్రజలు తిరుగుతూనే ఉండాలని, ఈ సందర్భంగా చుట్టూ కార్యకర్తలను తిప్పు కోవాల్సి ఉంటుంది.దీంతో తమ జేబులకు చిల్లులు పడతాయి అని ఆందోళన చెందుతున్నారు.

అసలే ఎన్నికలంటే లక్షలాది రూపాయలు ఖర్చు ఉంటుంది.ఇప్పుడు మరో ఆరు వారాల పాటు వీరందరిని పోషించాలంటే అప్పులు చేయక తప్పదని వీరంతా తెగ బాధ పడి పోతున్నారు.

***

ఈ విషయంలో జనసేన, బిజెపి , టిడిపి, వైసిపి అనే పార్టీల బేధం లేకుండా అన్ని పార్టీల అభ్యర్థులు బాధ లో ఉన్నారు.ఇతర రాజకీయ పార్టీలు కూడా దాదాపు ఇదే ఆలోచనతో ఉన్నాయి.ప్రస్తుతం ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రత్యర్థి పార్టీలు ప్రలోభ పెట్టకుండా వారిని జాగ్రత్తగా కాపాడుకోవాలని, అవసరమైతే వారిని ఎన్నికలు జరిగే వరకు ఏదైనా ప్రాంతంలో వారికి షెల్టర్ కల్పిస్తే ఏ విధంగా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నాయి.మొత్తంగా చూస్తే ఎన్నికల వాయిదా పడడం పార్టీలకు ఆయా పార్టీల తరఫున పోటీచేసే అభ్యర్థులకు ఆర్థికంగా గా తీవ్ర నష్టం చేకూరుస్తుందనే చెప్పాలి.

వైసిపి కోర్టుకు వెళ్లాలని చూస్తుండడంతో ఎన్నికలు కాస్త ముందుగానే నిర్వహించే అవకాశం ఉంటుందేమో నని పోటీ చేసే అభ్యర్థులు అంతా ఆశలు పెట్టుకున్నారు.

#APCM #APElections #AP Elections #YCPLeaders #AP YCP Party

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

All Ap Party Local Leaders Suffer From Elections Post Poned Related Telugu News,Photos/Pics,Images..