ఆ కారణం వల్లే సర్జరీ వద్దనుకున్నా.. నటి కీలక వ్యాఖ్యలు..?

సినిమా రంగంలో గుర్తింపు వచ్చిన, గుర్తింపు తెచ్చుకుంటున్న హీరోయిన్లలో చాలామంది హీరోయిన్లు సర్జరీ చేయించుకున్నారనే సంగతి తెలిసిందే.అయితే చాలామంది హీరోయిన్లు సర్జరీ చేయించుకున్నామన్న విషయాన్ని చెప్పుకోవడానికి ఇష్టపడరు.

 Aliya Revelas She Considered Cosmetic Surgery Her Nose-TeluguStop.com

అయితే సీనియర్ నటి పూజా బేడీ కూతురు అలయా మాత్రం తన ముక్కు ఒకవైపు ఎత్తుగా ఉన్నా తాను సర్జరీ చేయించుకోవాలని అనుకోవడం లేదని అన్నారు.

తనకు ఉన్న లోపం చాలా చిన్న లోపం అని ఆ లోపాన్ని ప్రజలు అంగీకరిస్తారో లేదో తనకు తెలియదని ఆమె చెప్పుకొచ్చారు.

 Aliya Revelas She Considered Cosmetic Surgery Her Nose-ఆ కారణం వల్లే సర్జరీ వద్దనుకున్నా.. నటి కీలక వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జవాని జానేమన్ అనే సినిమాతో నటిగా కెరీర్ ను మొదలుపెట్టిన అలయా హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.తన ముక్కు ఒకవైపు ఎత్తుగా ఉండటంతో ఒకానొక సమయంలో కాస్మోటిక్ సర్జరీ చేయించుకోవాలని అనుకున్నానని కానీ ముక్కు మరోవైపు బాగుంటుంది కాబట్టి ఆ నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గానని ఆమె చెప్పుకొచ్చారు.

తనను చూసే ప్రేక్షకులు తన గురించి ఏమని అనుకుంటారో తనకు తెలియదని తాను మాత్రం తనకు మాత్రం సర్జరీ చేయించుకునే ఆలోచన అయితే లేదని అలయా చెప్పుకొచ్చారు.ప్రస్తుతం అలయా ఏక్ జౌర్ గజాబ్ కహానీ అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందని భావిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

చాలామంది హీరోయిన్లు సర్జరీల ద్వారా అందాన్ని పెంచుకుంటున్నారని తనకు మాత్రం ఆ ఆలోచన లేదని ఆమె అన్నారు.

పాతతరం హీరోయిన్ల నుంచి కొత్తతరం హీరోయిన్ల వరకు ఎంతోమంది హీరోయిన్లు కాస్మోటిక్ సర్జరీలు చేయించుకున్నారు.

అయితే అలయా సర్జరీ చేయించుకోవట్లేదని చెబుతూ సర్జరీలు చేయించుకున్న హీరోయిన్లపై విమర్శలు చేస్తోందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.అయితే ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు సర్జరీ చేయించుకోకపోయినా నటిగా తమకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

#PoojaBhedi #Her Nose #Alaya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు