పిల్లల విషయంలో హీరోలను ఎందుకు అడగరు.. వైరల్ అవుతున్న అలియా షాకింగ్ కామెంట్స్!

సాధారణంగా టాలీవుడ్ హీరోయిన్లు వివాదాస్పద ప్రశ్నల గురించి రియాక్ట్ కావడానికి ఎంతో ఆలోచిస్తారు.అయితే బాలీవుడ్ హీరోయిన్లు( Bollywood ) మాత్రం ఆ తరహా ప్రశ్నలు ఎదురైతే ఒకింత ఘాటుగా రియాక్ట్ అవుతారు.

 Alia Bhatt  Shocking Comments Details Here Goes Viral In Social Media  , Alia Bh-TeluguStop.com

సాధారణంగా వరుస ఆఫర్లతో హీరోయిన్ గా కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమయంలో హీరోయిన్లు ఎవరూ పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని భావించరు.ఈ విషయంలో అలియా మాత్రం భిన్నంగా అడుగులు వేసిన సంగతి తెలిసిందే.

ఒక ఇంటర్వ్యూలో అలియా భట్( Alia Bhatt ) కు కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలో తల్లి అవ్వాలని ఎందుకు అనిపించిందనే ప్రశ్న ఎదురైంది.ఈ ప్రశ్నకు అలియా స్పందిస్తూ కెరీర్ తొలినాళ్లలో ఉన్న సమయంలో బిడ్డను కనడం ధైర్యమైన నిర్ణయమా అని హీరోలను ఎందుకు అడగరని ఆమె ప్రశ్నించారు.

రాహాకు సంబంధించిన ఎన్నో ప్రశ్నలను ఇంటర్వ్యూలలో రణ్ బీర్ ను అడిగారని మరి నన్ను అడిగిన ప్రశ్న ఎందుకు అడగలేదని అలియా పేర్కొన్నారు.

కేవలం హీరోయిన్లను మాత్రమే ఎందుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారని ఆమె కామెంట్లు చేశారు.నా సినీ కెరీర్ మొదలైన పదేళ్ల తర్వాత బిడ్డకు జన్మనిచ్చానని ఈ విషయంలో నేను ఎంతగానో సంతోషిస్తున్నానని అలియా చెప్పుకొచ్చారు.నాకు ఏ నిర్ణయం సరైనది అనిపిస్తుందో ఆ నిర్ణయాన్నే నేను పాటిస్తానని అలియా అన్నారు.

గతంలో నేను పలు భారీ ప్రాజెక్ట్ లను రిజెక్ట్ చేసిన సందర్భాలు సైతం ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు.

మరోసారి రాహా విషయంలో నన్ను ఇలాంటి ప్రశ్నలు అడగవద్దని అలియా భట్ కామెంట్ చేశారు.నాకు నచ్చిన పనులు మాత్రమే చేస్తానని నచ్చని పనులకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయనని అలియా పేర్కొన్నారు.అలియా వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube