ఆర్ఆర్ఆర్ లో అలియా భట్ ఆచార్యలో పూజా హెగ్డే.. ఇద్దరు హీరోయిన్ల పరువు పోయిందిగా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హీరోల సినిమాలలో హీరోయిన్ల పాత్రల గురించి నెగిటివ్ కామెంట్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి.అయితే ఈ మధ్య కాలంలో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోతుంది.

 Aliya Bhatt Pooja Hegde Roles In Movies Negative Comments Details, Alia Bhatt ,-TeluguStop.com

ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా భట్ పాత్ర కేవలం 15 నిమిషాలకు పరిమితమైన సంగతి తెలిసిందే.అలియా భట్ పోషించిన సీత పాత్రకు సంబంధించిన సీన్లు బాగానే ఉన్నా అలియా ఫ్యాన్స్ మాత్రం ఆమె రోల్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ సైతం అలియా భట్ పాత్ర పరిధిని పెంచి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేయగా ఆ అభిప్రాయం వైరల్ అయింది.అయితే ఆచార్యలో పూజా హెగ్డేకు కూడా అలాంటి పాత్రే దక్కింది.

సినిమాలో పూజా హెగ్డే 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం కనిపించదు.సినిమాలో నీలాంబరి పాత్ర ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకునే విధంగా లేదని కామెంట్లు వినిపించాయి.

సిద్ధ నీలాంబరి పాత్రల మధ్య కెమిస్ట్రీని అద్భుతంగా తెరకెక్కించడంలో దర్శకుడు కొరటాల శివ ఫెయిల్ అయ్యారు.

Telugu Acharya, Aliya Bhattt, Chiranjeevi, Koratala Shiva, Kgf Chapter, Pooja He

మరోవైపు పూజా హెగ్డే నెగిటివ్ సెంటిమెంట్ వల్లే ఈ సినిమా ఫ్లాపైందని మరి కొందరు చెబుతున్నారు.మరోవైపు ఆచార్య సినిమాలో ఎక్కువ సంఖ్యలో విలన్లు ఉన్నా ఒక్క విలన్ కు కూడా సరైన ప్రాధాన్యత దక్కకపోవడం గమనార్హం.ఈ సినిమా రిజల్ట్ విషయంలో ప్రేక్షకుల ముందు కొరటాల శివ దోషిగా నిలబడ్డారు.

Telugu Acharya, Aliya Bhattt, Chiranjeevi, Koratala Shiva, Kgf Chapter, Pooja He

చరణ్ కెరీర్ లో వినయ విధేయ రామ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలవగా ఈ సినిమా ఆ సినిమాను మించిన ఫ్లాప్ గా ఆచార్య నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాలను చూసిన ప్రేక్షకులకు రొటీన్ కథ, కథనాలతో తెరకెక్కిన ఆచార్య సినిమా ఏ మాత్రం ఆకట్టుకోవడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube