వామ్మో.. ఆ హీరో ఒక్క సినిమాను 72 సార్లు చూశాడట!

ఎవరైనా అభిమానులు ఒక సినిమా లేదా ఒక హీరో నచ్చినట్లయితే వాళ్ళ సినిమాను ఎన్నిసార్లయినా చూడగలరు.ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు ఆ అభిమానులకు.

 Alitho Saradga With Sree Vishnu, Alitho Saradaga, Sree Vishnu, Anil Ravipudi, To-TeluguStop.com

టీవీలో ఎన్నిసార్లైనా చూసే అభిమానులను చూశాం.కానీ ఇక్కడ ఓ హీరో థియేటర్ లోనే ఏకంగా 72 సార్లు చూశాడంట.

ఇంతకీ ఆయన ఎవరో తెలుసుకుందాం.

ప్రముఖ తెలుగు సినీ నటుడు శ్రీ విష్ణు.

ఈయన గురించి అందరికీ తెలిసిందే.ఈయన తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నగా.

తన గురించి కొన్ని విషయాలు తెలుపుతూ తన సినీ ప్రయాణం గురించి పంచుకున్నారు.అంతే కాకుండా ఆయన హీరోగా పరిచయం కాకముందు ఎలా ఉండేవాడు అవన్నీ విషయాలు తెలిపాడు.

తాజాగా ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో శ్రీ విష్ణు అతిథులుగా వచ్చారు.ఈ కార్యక్రమానికి సంబంధించిన వచ్చే ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా అందులో వీళ్ళు ఆలి తో మాట్లాడిన మాటలు బాగా ఆకట్టుకున్నాయి.

ఇక ఇందులో ఆలీ వీరిద్దరి అడిగిన ప్రశ్నలకు కొన్ని సమాధానాలు తెలిపారు.ఇక అనిల్ పరిచయం తర్వాత శ్రీ విష్ణు అడిగిన ప్రశ్నలలో ఆలీ తనను ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏంటి అని అడుగగా.‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా పేరు చెప్పాడు.అంతేకాకుండా 72 సార్లు థియేటర్లోనే చూశానని చెప్పాడు.

ఇక ఈ సినిమా గురించి ఆలి కొన్ని విషయాలు అడుగుతూ సరదాగా నవ్విస్తున్నాడు.ఇక కొన్ని వ్యక్తిగత విషయాల గురించి అడుగుతూ కామెంట్లను చేస్తున్నాడు ఆలీ.మొత్తానికి ఈ ప్రోమో బాగా ఆకట్టుకోగా మార్చి 15వ తేదీన ప్రసారం కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube