రామోజీరావుతో బ్లాంక్ చెక్ తీసుకున్న నటి ఎవరో తెలుసా?

ఆమె ఒక నాట్య “మయూరి”ఆమె నాట్యం చూసి నటరాజు సైతం గర్వించే భరత నాట్య మయూరి.ఆమె సంకల్పం, పట్టుదల ఆమెకు ఎన్నో విజయాలను అందించాయి.

 Alitho Saradaga Sudha Chandran Actress 28th December 2020 Etv Telugu , Alitho Sa-TeluguStop.com

తన ముందు ఉన్న ప్రతి సమస్యను ఒక సవాలుగా స్వీకరించి వాటిని ఎదిరించి తన జీవితం విజయ పతనం వైపు మళ్లించింది.ఆమె మరెవరో కాదు నటన, నాట్యం రంగాలలో తనదైన ముద్రను సంపాదించుకున్న నాట్యమయూరి “సుధాచంద్రన్”.

తాజాగా ఈమె ఈటీవీలో ప్రసారమయ్యే” ఆలీతో సరదాగా“ఈ కార్యక్రమంలో పాల్గొని తన జీవితంలో ఎదురైన ఎన్నో సంఘటనలను పంచుకున్నారు.

ఈ మధ్య కాలంలో మనం ఎంతో మంది బయోపిక్ చిత్రాలను గురించి మాట్లాడుకుంన్నాం.

కానీ ఒక కారు ప్రమాదంలో యాక్సిడెంట్ అయిన తన కాళ్ళతో నృత్యం చేయాలనే పట్టుదల ఉన్న సుధాచంద్రన్ జీవిత ఆధారంగా ఓ సినిమాని తెరకెక్కించాలని రామోజీ రావు గారు భావించారు.ఈ విధంగా మొదటి బయోపిక్ చిత్రాన్ని నిర్మించిన మొదటి నిర్మాతగా రామోజీరావు ఉన్నారు.

సాధారణంగా ఎవరైనా బయోపిక్ చిత్రాలలో సెలబ్రిటీలు నటిస్తారు.కానీ సుధాచంద్రన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన “మయూరి” చిత్రంలో “మయూరి” పాత్రలో సుధాచంద్రన్ నటించడం ఎంతో విశేషం.

మయూరి సినిమా విడుదలయ్యి బాక్సాఫీస్ దగ్గర మంచి స్పందన పొందింది.ఈ చిత్రం విడుదలై దాదాపు 35 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ సుధాచంద్రన్ ను చూడగానే మయూరి అని పలకరిస్తారు అంటే ఈ సినిమా ఏ స్థాయిలో ప్రజలను ఆకట్టుకుందో అర్థమవుతుంది.

ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెబుతూ, ఈ సినిమా పూర్తయ్యే వరకు సుధాచంద్రన్ ఒక్కసారి కూడా రామోజీరావును చూడలేదట.ఈ సినిమా పూర్తయిన తర్వాత రామోజీ రావు గారు మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాను అని తెలియడంతో అమ్మానాన్నలతో కలిసి ఆయనను కలవడానికి వెళ్లానని తెలిపారు.

Telugu Alitho Saradaga, Blank Cheque, Mayuri, Ramojirao, Sudha Chandran, Tollywo

తెలుగు నిర్మాత అనగానే రామోజీ రావు గారిని నేను వేరేలా ఊహించుకున్నాను.కానీ ఆయనను చూడగానే ఎంతో భిన్నంగా అనిపించారు.మొదటి సారిగా నన్ను చూడగానే రామోజీ రావు గారు “నమస్కారం మయూరి గారు”అన్నారు.మీ గురించి చాలానే విన్నాను.మీరు కూర్చోండి, మీరు మా హీరోయిన్, మేము మిమ్మల్ని గౌరవిస్తామని అన్నారు.ఈ విధంగా మాట్లాడుతూ అప్పటిదాకా ఈ సినిమా రెమ్యూనరేషన్ గురించి మాట్లాడలేదు.

అప్పుడు రామోజీరావు గారు ఒక బ్లాంక్ చెక్ టేబుల్ పై పెట్టి, ఇది మీదే… మీ సంతకం చేసి ఎంత రెమ్యూనరేషన్ కావాలో మీరే చెప్పండి అని అన్నారు.అప్పుడు ఆయన మాటలకు వెంటనే మా నాన్న నా కూతురి మీద సినిమా తీయాలనే ఆలోచన ఉండేది.

కానీ అంత ఆర్థిక స్థోమత నా దగ్గర లేదు.ఫైనాన్షియర్ గా మీరు ఉండి నన్ను నిర్మాతను చేయండి అని చెక్ రామోజీరావు గారికి ఇచ్చి మీకు తోచినంత ఇవ్వండి అని చెప్పారు.

అప్పటి నుంచి నా బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గింది లేదని సుధాచంద్రన్ తెలిపారు.అప్పట్లో ఒక కొత్త నటికి 1.2 లక్షలు రెమ్యూనరేషన్ ఇవ్వడం అంటే ఎంతో విశేషమని ఈ కార్యక్రమంలో రామోజీ రావు గురించి సుధాచంద్రన్ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube