భోజనం కోసం కళ్యాణమండపాలకు వెళ్లేవాడిని.. సింగర్ మనో కన్నీళ్ల గాధ!

పాటైనా, మాటైనా.నవ్విచడమైనా.

 Alitho Saradaga Latest Interview With Singer-TeluguStop.com

ఏదైనా సరే ఆ పాత్రలో మునిగిపోయి 100% ఆ క్యారెక్టర్ కి న్యాయం చేయడంలో.ప్రేక్షకులను అలరించడంలో ఆయనకు ఆయనే సాటి.

నాలుగు దశాబ్దాలుగా తన అద్భుత గానంతో గాయకుడిగా సంగీతాభిమానుల మనసులు దోచుకుంటూనే డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా, నటుడిగా తనలోని విభిన్న పార్శ్వాలను ఆవిష్కరిస్తున్నారు మనో.సతీసమేతంగా తాజాగా ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా మనో, ఆయన సతీమణి జమీల ఎన్నో విషయాలు పంచుకున్నారు.

 Alitho Saradaga Latest Interview With Singer-భోజనం కోసం కళ్యాణమండపాలకు వెళ్లేవాడిని.. సింగర్ మనో కన్నీళ్ల గాధ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సందర్భంగా మనో మాట్లాడుతూ తన చిన్నతనంలోనే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టడం తన అదృష్టమన్న మనో, చక్రవర్తి గారి దగ్గర చేరిన తర్వాత హార్మోనియం వాయించడం, పాటలు పాడడం.

గాయకులకు పాటలు నేర్పించడం, కంపోజింగ్‌ అసిస్టెంట్ ఇలా అన్నిరకాల పనులూ చేశానని ఆయన అన్నారు.

Telugu Actor, Alitho Saradaga, Dabbing Artist, Emotional, Jabardasth, Latest Interview, Singer Mano, Tollywood-Movie

అమ్మానాన్న కాకుండా తన లైఫ్‌లో ముఖ్యమైంది .తన సోదరి మహిజ అన్న మనో.తాను స్థిరపడటానికి ఆమే కారణమన్నారు.ఇల్లు, స్థలం కొనడం ప్లానింగ్‌ అంతా ఆమె వల్లనే సాధ్యమైందని ఆయన చెప్పుకొచ్చారు.ఆమె తరువాత తన సామ్రాజ్యాన్ని నడిపిస్తుంది జమీలే అని.తను నా భార్యగా దొరకడం అదృష్టమని ఆయన తెలిపారు.పనివెతుక్కోవడం, డబ్బులు సంపాదించడం మన పని.ఇంటిని, పిల్లల బాధ్యతను మోయడం సాధారణ విషయం కాదని మనో అన్నారు.

Telugu Actor, Alitho Saradaga, Dabbing Artist, Emotional, Jabardasth, Latest Interview, Singer Mano, Tollywood-Movie

జీ ఆనంద్‌గారు మా అమ్మానాన్నలతో పనిచేసేవారట. తాను విశ్వనాథ్‌గారి దగ్గర పనిచేస్తున్నానని తెలిసి ఆయనకు దగ్గరలోనే రూ.35కు అద్దె గది చూపించారని ప్రతినెలా రూ.150 పంపించేవాడినని మనో తెలిపారు.మిగిలిన డబ్బులతోనే నెలంతా గడిపేవాడినని మంచి భోజనం చేయాలంటే అప్పుడు పాండిబజార్లోని కళ్యాణమండపాలకు వెళ్లేవాడిని.

ఒకసారి వెళ్తే మళ్లీ 15 రోజుల వరకూ అటు దిక్కు వెళ్లేవాడిని కాదని వాచ్‌మెన్‌ గుర్తుపడతాడేమోనని భయం ఉండేదని అయన ఒకప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.ప్రస్తుతం ఈయన జబర్దస్త్ షోలోనూ అందర్నీ నవ్విస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు గాయకుడు మనో.ఇలా సాఫీగా సాగిపోతున్న జమీల – మనో వైవాహిక జీవితంలో… మరెన్నో మధుర స్మృతులు.మరెన్నో మరపురాని అనుభూతులు ఉండాలని … ఆశిద్దాం.

#Jabardasth #Mano #Artist #Alitho Saradaga #Interview

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు