పదేళ్లకే నాకు పెళ్లి చేశారు.. నటి కీలక వ్యాఖ్యలు..? - Alitho Saradaga Krishnaveni Comments About Child Marriage

alitho saradaga krishnaveni comments about child marriage, 10 years , Alitho Saradaga , child marriage, Dubbing Janaki Krishnaveni, tollywood , ali - Telugu 10 Years, Alitho Saradaga, Child Marriage, Dubbing Janaki, Krishnaveni

స్టార్ కమెడియన్ అలీ హోస్ట్ చేసున్న కార్యక్రమాలలో అలీతో సరదాగా షో ఒకటనే సంగతి తెలిసిందే.ప్రతి సోమవారం ప్రసారమయ్యే ఈ షో ప్రోమో తాజాగా రిలీజైంది.

 Alitho Saradaga Krishnaveni Comments About Child Marriage-TeluguStop.com

ఈ షోకు అలనాటి నటీమణులు డబ్బింగ్ జానకి, కృష్ణవేణి అతిథులుగా హాజరయ్యారు.వస్తాడు నారాజు ఈరోజు పాటతో డబ్బింగ్ జానకి, కృష్ణవేణి ఎంట్రీ ఇచ్చారు.

అలీ డబ్బింగ్ జానకిని మీ ఇంటి పేరు ఏమిటని అడగగా ఆమె దాసరి అని చెప్పారు.

 Alitho Saradaga Krishnaveni Comments About Child Marriage-పదేళ్లకే నాకు పెళ్లి చేశారు.. నటి కీలక వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలీ దాసరి జానకి అని చెబితే ఎవరావిడ ? అంటారు కదా అని అడగగా ఆమె అవునని డబ్బింగ్ జానకి అంటే మాత్రమే తనను గుర్తు పడతారని చెప్పారు.తనను డబ్బింగ్ జానకి అని పిలవడంపై తాను చాలాసార్లు పోట్లాడానని ఆమె తెలిపారు.చెన్నైకు ఎందుకు వెళ్లారని అలీ అడగగా పెళ్లి చేసుకొని రహస్యంగా పారిపోయామని తన పెళ్లికి సంబంధించి డబ్బింగ్ జానకి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Telugu 10 Years, Alitho Saradaga, Child Marriage, Dubbing Janaki, Krishnaveni-Movie

ఆ తరువాత కృష్ణవేణి ఈ మధ్య కాలంలో ఆఫర్లతో బాగా బిజీ అయ్యారని అలీ అన్నారు.చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవారట కదా ? అని అడగగా ఆ అల్లరి వల్లే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చానని తాను భావిస్తానని కృష్ణవేణి తెలిపారు.తనకు 1976లో డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిందని బస్సు, లారీ, కారు అన్నీ తాను నడుపుతానని ఆమె అన్నారు.తనకు 10 సంవత్సరాల వయస్సులోనే మ్యారేజ్ అయిందంటూ ఆమె ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

తన పెద్దక్కకు ఐదు సంవత్సరాల వయస్సులోనే పెళ్లి జరిగిందని బాల్యంలోనే తనకు పెళ్లి కావడంతో ఫ్రెండ్స్ చాలా ఏడిపించేవారని ఆమె అన్నారు.తనను ఎవరైనా పెళ్లైందని ఎగతాళి చేస్తే గట్టిగా చేతిని కొరికేసేదానినని ఆమె వెల్లడించారు.

డబ్బింగ్ జానకి, కృష్ణవేణి ఈ ఇంటర్య్వూలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

#10 Years #Krishnaveni #Child Marriage #Alitho Saradaga #Dubbing Janaki

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు