ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీ అయిన స్కాట్ అండ్ లేడీ స్కాట్  

Alison Doody shares Scott and Lady Scott, Tollywood, Bollywood, Hollywood, RRR Movie, Rajamouli, Jr NTR, Ram Charan - Telugu Bollywood, Hollywood, Jr Ntr, Rajamouli, Ram Charan, Rrr Movie, Tollywood

దర్శక దిగ్గజం రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు.ఈ సినిమాని సింగిల్ షెడ్యూల్ లో గ్యాప్ లేకుండా షూటింగ్ చేసి పూర్తి చేయాలని జక్కన్న అనుకుంటున్నారు.

TeluguStop.com - Alison Doody Shares Scott And Lady Scott

అందుకు తగ్గట్లుగానే షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు. లాక్ డౌన్ అనంతరం ఎన్ఠీఆర్ తో షూటింగ్ స్టార్ట్ చేసిన జక్కన్న అతనికి సంబందించిన కీలక సన్నివేశాలని తెరకెక్కించారు.

తరువాత తారక్ కి కొంత విరామం ఇచ్చారు హాలీవుడ్ యాక్టర్స్ ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.స్కాట్, లేడీ స్కాట్ పాత్రలకి సంబందించిన సన్నివేశాలని షూట్ చేస్తున్నారు.

TeluguStop.com - ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీ అయిన స్కాట్ అండ్ లేడీ స్కాట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అలాగే ఎన్ఠీఆర్ కి జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరీస్ జెన్నిఫర్ పాత్రలో సినిమాలో కనిపించబోతుంది.ఇక ఎన్ఠీఆర్ ఒలీవియా కాంబినేషన్ లో సన్నివేశాలకి సంబంధించి షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

అలాగే ఈ సినిమాలో సీత పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తుంది.రామ్ చరణ్, అలియా కాంబినేషన్ లో సన్నివేశాలని వచ్చే వచ్చే నెల ఆఖరు నుంచి లేదంటే జనవరిలో ప్రారంభించే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే సినిమాలో లేడీ స్కాట్ గా నటిస్తున్న ఐరిష్‌ నటి అలిసన్‌ డూడీ ఆర్‌ఆర్‌ఆర్‌ సెట్‌లో స్కాట్‌ అండ్‌ లేడీ స్కాట్ అని శనివారం ఉదయం ఒక ఫొటోను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.ఫొటోలో ఆమెతో పాటు హాలీవుడ్‌ నటుడు రే స్టీవెన్‌సన్‌ ఉన్నారు.

మొత్తానికి ఈ ఫోటో షేర్ చేయడం ద్వారా హాలీవుడ్ నటులు కూడా రాజమౌళి డైరక్షన్ ని ఆశ్వాదిస్తున్నట్లు ఉన్నారు.అలాగే కెరియర్ లో మొదటి సారి ఒక ఇండియన్ మూవీలో పవర్ ఫుల్ పాత్రలలో కనిపిస్తూ ఉండటంతో వారి సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు.

#Hollywood #Rajamouli #Ram Charan #Jr NTR

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Alison Doody Shares Scott And Lady Scott Related Telugu News,Photos/Pics,Images..