హెల్మెట్ పెట్టుకోని కారు డ్రైవర్,ఫైన్ విధించిన ట్రాఫిక్ పోలీసులు!

ఈ నెల 1వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే భారీ గా ఫైన్ లను వేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఒక వ్యక్తి హెల్మెట్ ధరించలేదని ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు.

 Aligarhmanissued Achallanfor Notwearing Helmet Insidethe Car-TeluguStop.com

అయితే ఈ ఘటన గురించి తెలుసుకుంటే మాత్రం అందరూ ట్రాఫిక్ పోలీసులను తిట్టుకోక మానరు.అదేంటి హెల్మెట్ లేకపోతె నేరమే కదా దానికి వారు చేసిన తప్పు ఏంటి అని అనుకుంటున్నారా.

ఇక్కడే ఒక మెలిక ఉంది,ఇంతకీ హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేసింది బైక్ ని కాదు కారుని.కారు లో ఎవరైనా సీటు బెల్ట్ అనేది పెట్టుకొని డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది,ఒకవేళ సీటు బెల్ట్ పెట్టుకోలేదా అది నేరంగా పరిగణించవచ్చు.

కానీ ఇక్కడ మాత్రం కారులో వెళ్తున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోలేదని ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు.ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ అలీగఢ్ లో చోటుచేసుకుంది.

కారు డ్రైవ్ చేస్తున్న ఒక యువకుడు… చక్కగా సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు.కారు వేగం కూడా లిమిట్‌లోనే ఉంది.

అలాంటిది ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గరకు రాగానే… వన్ మినిట్ అంటూ… కారును పక్కకు తెమ్మన్నారు ట్రాఫిక్ పోలీసులు.ఆ తర్వాత అతనికి రూ.500 ఫైన్‌కి సంబంధించి ఛలాన్ ఇచ్చారు.అయితే ఎందుకు ఫైన్ వేశారో అర్ధం కానీ ఆ యువకుడు అందులో ఉన్న తన కారు నెంబర్ చూసి కంగారు పడ్డారు.

ఏంటంటే ఆ చలానా లో హెల్మెట్ పెట్టుకోనందుకు ఫైన్ వేసినట్లు ఉంది.వెంటనే దానిని చూసి ఆశ్చర్యపోయిన ఆ యువకుడు ఇదేంటని అడిగితే పోలీసులు ఇంకెలాంటి లాపాయింట్లు లాగుతారో అన్న భయంతో నోరు మూసుకొని ఫైన్ చెల్లించి అక్కడ నుంచి జారుకున్నాడు.

అయితే ఈ ఘటన తో అతడు అప్రమత్తమై మర్నాడు కారు ఎక్కుతూ మర్చిపోకుండా హెల్మెట్ కూడా పెట్టుకున్నాడు.అలా వెళుతున్న అతడిని కొందరు ప్రశ్నించగా జరిగిన ఘటనను వివరించాడు.

Telugu Fine, Aligarh, Aligarh Challan, Helmet Car, Trafic-

 

మళ్లీ పోలీసులు ఎలాంటి ఫైన్ విధించకూడదు అనుకోని ఈ విధంగా హెల్మెట్ ధరించినట్లు తెలిపాడు.దీనితో పోలీసులు కూడా స్పందిస్తూ ఎదో టెక్నీకల్ ప్రాబ్లమ్ వల్ల ఇలా జరిగింది అని ఆ సొమ్మును వెనక్కి ఇచ్చేస్తామంటూ తెలిపారు.ఫైన్ లు ఉండొచ్చు కానీ మరి ఇంతలా కారు లో కూడా హెల్మెట్ పెట్టుకోలేదంటూ ఫైన్ వేయడం మాత్రం అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube