మెకానిక్ కొడుకు.. ఎంత గొప్ప ఘనత సాదించాడూ..!

కృషి పట్టుదల దృఢమైన సంకల్పం ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చు అని ఇప్పటికే ఎంతోమంది నిరూపించారు.మన స్థాయి ముఖ్యం కాదు మన సంకల్పం ముఖ్యము అని ఎంతోమంది రుజువు చేశారు.

 Aligarh Mechanic's Son Tops At Us High School, Mohammad Shadab, E Kennedy-lugar-TeluguStop.com

ఇక్కడ ఓ యువకుడు కూడా అదే నిరూపించాడు.ఉత్తరప్రదేశ్ అలీగడ్ జిల్లాకు చెందిన ఒక యువకుడు అమెరికన్ స్కాలర్షిప్ తో అక్కడి హైస్కూల్లో విద్య కోసం వెళ్లి అక్కడ ప్రతిభ చూపించాడు.

అలీగడ్ కి చెందిన ఓ మోటార్ మెకానిక్ కొడుకు మహమ్మద్ షాదాబ్ చిన్నప్పటి నుంచి చదువులో ఎంతో చురుకుగా ఉండేవాడు.

ఈ క్రమంలోనే అమెరికా ప్రభుత్వం ఇచ్చే కెన్నెడీ లూక యూత్ ఎక్స్చేంజ్ స్కాలర్షిప్కు ఎంపికయ్యారు షాదాబ్.

ఇక ఈ స్కాలర్షిప్ ద్వారా దాదాపు 20 లక్షలు వచ్చాయి.దీంతో హైస్కూల్ చదువు కోసం అమెరికా వెళ్లాడు.అక్కడికి వెళ్ళి కూడా తన ప్రతిభను చాటాడు.800 మంది చదువుతున్న అమెరికన్ హై స్కూల్ టాపర్గా నిలిచి తల్లిదండ్రులకు పుత్రోత్సాహాన్ని నింపాడు.

అయితే ఒక మెకానిక్ కొడుకు ఎంతో కష్టపడి చదివి అమెరికాలో హై స్కూల్ టాపర్గా నిలవడం గొప్ప విషయం అని ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు.దీనిపై స్పందించిన షాదాబ్ మాట్లాడుతూ ఇది నాకు చాలా గొప్ప విజయం… అమెరికా స్కాలర్షిప్ తో ఇక్కడికి చదువుకోవడానికి వచ్చి నేను టాపర్గా నిలిచాను అంటూ ఆనందం వ్యక్తం చేశారు, దీని కోసం ఎంతో శ్రమించాను.

ఇంకా బాగా చదివి కుటుంబానికి మద్దతుగా నిలవాలనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు షాదాబ్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube