వైరల్ వీడియో: భూమిపై దిగిన గ్రహాంతరవాసులు…?!  

aliens who landed on earth Alians, UFO, Earth, America, CC Tv Camera Record, esoteric And Paranormal World - Telugu Aliens, America, Texas, Ufo

భూమిపై అనేక రకాల జీవజాతులు, మనుషులు కలిసి జీవిస్తున్నాయి.ఇది సరిపోదు అంటు అనంతవిశ్వంలో కేవలం భూమి మీద మాత్రమే కాకుండా.

TeluguStop.com - Aliens Who Landed On Earth

మరి కొన్ని గ్రహాలపై మరిన్ని జీవులు జీవిస్తున్నాయి.మనిషి లాంటి బుద్ధిజీవి ఒకరే ఉన్నారా…? లేకపోతే, మిగతా ప్రాంతాల్లో కూడా ఉన్నారా అన్న ప్రశ్నలు అప్పుడప్పుడు మనకు వస్తూనే ఉంటాయి.ఇందుకు సమాధానం కనుక్కోవడానికి శాస్త్రవేత్తలు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు కూడా.అయితే ఇందుకు రుజువుగా కొన్ని వీడియోలు సాక్ష్యంగా చూపిస్తున్నారు శాస్త్రవేత్తలు.నిజానికి గ్రహాంతర జీవులపై చర్చ ఇప్పటిది కాదు.ఎప్పుడు నుంచో ఇందుకు సంబంధించి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

కొందరు గ్రహాంతర జీవులు ఉన్నాయని గట్టిగా చెబుతుంటే మరికొందరు మాత్రం ఇవన్నీ వేస్ట్ అని, అలాంటివి నమ్మొద్దని చెబుతుంటారు.ఈ చర్చల నేపథ్యంలో తాజాగా మరో వీడియో ఒకటి గ్రహాంతర వాసులు ఉన్నారు అన్నట్లు ఆసక్తికరమైన విషయాన్ని చెబుతున్నారు.

TeluguStop.com - వైరల్ వీడియో: భూమిపై దిగిన గ్రహాంతరవాసులు…-General-Telugu-Telugu Tollywood Photo Image

తాజాగా ఈ విషయానికి సంబంధించి ఓ వీడియో అమెరికాలో తెగ హల్చల్ చేస్తోంది.ఆ వీడియో అమెరికాలో గ్రహాంతరవాసులకు సంబంధించింది వీడియో అంటూ తెగ వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో ఓ సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.రెండు గ్రహాంతర జీవులు జనాలు మధ్య కనిపించాయని చెబుతున్న ఈ వీడియోను అమెరికాకు చెందిన ‘ఎసోటెరిక్ అండ్ పారానార్మల్ వరల్డ్’ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేయడం జరిగింది.

ఈ వీడియోని టెక్సాస్ ప్రాంతంలో రికార్డు చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఆ వీడియోలో ఓ రెండు జీవులు అనాలో, లేకపోతే గ్రహాంతర జీవులు అనాలో తెలియని ఆకారాలు రోడ్డుపై అటూఇటుగా కదులుతున్నట్లు ఉంది.

ఈ వీడియోను చూసిన కొందరు రాత్రివేళ అందరూ పడుకున్న తర్వాత భూమిపై వింత జీవులు దిగాయని చిన్నపిల్లలు మాదిరి ఆడుకుంటున్నట్టు కనిపించాయని కామెంట్ చేస్తున్నారు.ఇక ఈ వీడియో ఫొటోస్ సంబంధించి ఏలియన్ హంటర్ గా చెప్పుకునే స్కాట్ సీ వారింగ్ అనే వ్యక్తి విశ్లేషించారు.

ఇందుకు సంబంధించి గ్రహాంతర జీవులు అని ఆయన అభిప్రాయపడ్డారు.ఇప్పటివరకు మనం భూమి పై ఎగిరే పళ్ళాలు గ్రహాంతర వాసులు కదలికలు అంటూ ఎన్నో యు.ఎఫ్.ఒ కు సంబంధించి ఘటనలు చాలానే మనం విన్నాం.దింతో గ్రహాంతరవాసులు భూమిపై అడుగు పెడుతున్నారని చాలామంది ఇప్పటికి చెబుతుంటారు కూడా.

#America #Aliens #Texas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Aliens Who Landed On Earth Related Telugu News,Photos/Pics,Images..