మానవ స్పెర్మ్ కోసం వేటాడుతున్న ఏలియన్స్? దానికోసమేనా?

ప్రపంచ శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి ఏలియన్స్ ( Aliens ) గురించి పరిశోధనలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.ఇతర గ్రహాలపై నివసించే వ్యక్తులను మనవాళ్ళు ఏలియన్స్ గా పరిగణిస్తున్నారు.

 Aliens Stealing Human Sperm To Create Human Hybrid Race On Earth Details,  Lates-TeluguStop.com

అసలు ఇతర గ్రహాల మీద జీవరాశి ఉండడానికి ఆస్కారం లేదని కొంతమంది అంటుంటే కొంతమంది మాత్రం అక్కడ మనిషిని పోలిన ఏలియన్స్ వంటివి జీవించి వుంటాయని వాదిస్తూ వున్నారు.ఈ క్రమంలోనే ఏళ్ల తరబడి ఏలియన్స్ గురించి రకరకాలుగా పరిశోధనలు జరుగుతూ వున్నాయి.

ఈ క్రమంలో మనకు ఏలియన్స్ గురించి ఎప్పటికప్పుడు రరకాల కధనాలు వినబడుతూ ఉంటాయి.అందులో దాదాపుగా వినడానికి ఆశ్చర్యాన్ని కలిగించేవిగా ఉంటాయి.అలాంటి మరొక విషయమే ఇపుడు సోషల్ మీడియాలో సర్కిల్ అవుతోంది.తాజాగా యూఎఫ్ఓ ( UFO ) ఎక్స్ పర్ట్ ఒకరు చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని సృష్టిస్తున్నాయి.

గ్రహాంతరవాసుల కళ్లు మనపైనే కాకుండా మన పునరుత్పత్తి వ్యవస్థపై కూడా ఉన్నాయని ఆ సో కాల్డ్ నిపుణుడు అంటున్నాడు.

అవును, యూఎఫ్ఓ నిపుణుడు కోలిన్ సాండర్స్. గ్రహాంతరవాసులు ఇప్పుడు మానవుల పునరుత్పత్తి వ్యవస్థపై కన్నేసినట్టు జోష్యం చెబుతున్నాడు.ఎందుకంటే వారి లక్ష్యం మానవుల వలె కనిపించే హైబ్రిడ్ గ్రహాంతరవాసుల సైన్యాన్ని సృష్టించడం కోసమట.

వినడానికి విడ్డురంగా వున్నా అతగాడు ఇదే మాట పదేపదే నొక్కి వక్కాణించి మరీ చెబుతున్నాడు.మనుషులు భూమిని నాశనం చేస్తున్నందున వారు భూమిని స్వాధీనం చేసుకొవాలని ప్లాన్ చేస్తున్నారట.

అందులో భాగంగా వారు మానవుని వీర్యం( Human Sperm ) దొంగిలించి తద్వారా శక్తివంతమైన సైన్యాన్ని స్థాపిస్తారట.కోలిన్ సాండర్స్ తన అనుభవం ఆధారంగా ఒక పుస్తకాన్ని కూడా వ్రాసాడు.అందులో ఈ హైబ్రిడ్ గ్రహాంతరవాసులు మనలాగే కనిపిస్తారని కూడా చెప్పాడు.వారు మనమధ్యన వున్నా మనం వారిని గుర్తించలేము అని చెబుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube