ఇంటి సీలింగ్ పై వింత ప్రాణి,ఆశ్చర్యపోయిన యజమాని

ఇటీవల వింత వింత జీవులు కనపడుతున్నాయి.సోషల్ మీడియా వేదికగా ఎక్కడ ఏదైనా వింత ప్రాణి కనిపించగానే వెంటనే ఏ వీడియో,ఫోటో నో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం అవి క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి.

తాజాగా ఇండోనేషియా లో ఒక వ్యక్తి తన ఇంటి సీలింగ్ పై ఒక వింత ప్రాణి దర్శనమిచ్చింది.ఆ జీవి కి రెండు రెక్కలు,నాలుగు టెంటకిల్స్,పొడవైన కాళ్ల తో చూడడానికి చాలా వింతగా ఏలియన్ లాగా అనిపించడం తో ఆ యజమాని ఆశ్చర్యపోయాడు.

వర్షం కురిసిన రాత్రి తేమతో కూడిన ఇంటి పై కప్పు మీద ఇది కదలాడడాన్ని తన ఇంటివారికి, బంధువులకు కూడా చూపాడాయన.అతికష్టం మీద సీలింగ్ లోని అవతలి భాగానికి కదులుతున్నటుగా కనిపించింది.

చూడబోతే ఇది చిన్న సైజు ఏలియన్ లా ఉందే అంటూ తనకు తానే చమత్కరించుకున్నాడు కూడా.అయితే ఇంతకీ ఆ వింత ప్రాణి ఏంటి అని తెలుసుకోగా, ఈ విచిత్రమైన, అరుదైన ఈ ప్రాణి క్రెటోనోటస్ గంగీస్ అనే జాతికి చెందిన కీటకమని ‘ కీటక నిపుణులు ‘ అంటున్నారు.

మామూలుగా అయితే ఇలాంటి ఈ కీటకం ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా దేశంలో కనిపిస్తాయట.

ఇంటి సీలింగ్ పై వింత ప్రాణి,ఆశ

అంతేకాకుండా తమ జాతి కీటకాలను ఆకర్షించడానికి అవి ఇలా తమ కాళ్ళను పైకీ, కిందికీ కదిలిస్తుంటాయని వాటికి వాసనతో కూడిన ‘ సెంట్ ‘ ఉంటుందని ఈ పరిశోధకులు చెబుతున్నారు.2017 లో ఇలాంటి జీవే ఆస్ట్రేలియాలో కనబడినట్టు వారు పేర్కొన్నారు.ఏది ఏమైనా చూడడానికి నిజంగా ఏలియన్ ఏమో అని అనిపించే ఈ వింత జీవికి చెందిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.

ఇటీవల ‘గొరిల్లా పిల్లలాగా కనిపించిన కాకి’ వీడియో కూడా ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube