అలియా ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్.. స్టార్ హీరోయిన్ల పై ట్రోల్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కిడ్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న నటి అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీలో అగ్ర తారగా గుర్తింపు పొందిన ఈమె నటుడు రణబీర్ తో ప్రేమలో పడింది.

 Alia Pregnancy Effect And Trolls On Star Heroines , Alia Bhatt , Pregnancy , Bollywood , Deepika Padukone , Katrina Kaif , Star Celebrities , Trolling , Heroines , Tollywood , Ranbir , Ultrasound Scanning Tests-TeluguStop.com

ఎన్నో సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఏప్రిల్ 14వ తేదీ కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.

ఇకపోతే మీరు వివాహం జరిగి రెండు నెలలు పూర్తి అయినప్పటికీ నేడు అలియా సోషల్ మీడియా వేదికగా తాను తల్లి కాబోతున్న విషయాన్ని ప్రకటించారు.

 Alia Pregnancy Effect And Trolls On Star Heroines , Alia Bhatt , Pregnancy , Bollywood , Deepika Padukone , Katrina Kaif , Star Celebrities , Trolling , Heroines , Tollywood , Ranbir , Ultrasound Scanning Tests-అలియా ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్.. స్టార్ హీరోయిన్ల పై ట్రోల్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు చేయించుకున్న ఫోటోని షేర్ చేస్తూ ఈ విషయాన్ని తెలియజేశారు.ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ విధంగా పెళ్లయిన రెండు నెలలకే శుభవార్తను చెప్పడంతో కొందరు నెటిజన్లు ఈమెకు శుభాకాంక్షలు తెలియ చేయడమే కాకుండా మరికొందరు స్టార్ సెలబ్రిటీలను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.

Telugu Alia Bhatt, Bollywood, Katrina Kaif, Pregnancy, Ranbir, Tollywood, Ultrasound-Movie

ఇకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర తారలుగా కొనసాగుతున్నటువంటి దీపికా పదుకొనే కత్రినాకైఫ్ వంటి సెలబ్రిటీలు కూడా వారు ప్రేమించిన వారిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.దీపికా పదుకొనే రణవీర్ సింగ్ వివాహం 2018లో జరిగింది.అదేవిధంగా గత ఏడాది డిసెంబర్ నెలలో కత్రినాకైఫ్ విక్కీ కౌశల్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా వీరిద్దరి పెళ్లి జరిగి కొన్ని సంవత్సరాలు నెలలు కావస్తున్నా ఇప్పటికీ పిల్లల గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని,ఈ హీరోయిన్స్ కూడా శుభవార్తను ఎప్పుడు చెబుతారు అంటు నెటిజన్లు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.ఇలా ఇద్దరు హీరోయిన్ల గురించి పెద్ద ఎత్తున నెటిజన్లు కామెంట్లు చేయడంతో మరికొందరు పిల్లలు కావాలి వద్దు అనుకోవడం పూర్తిగా వారి వ్యక్తిగత విషయమని వారికి మద్దతు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఆలియా ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ స్టార్ హీరోయిన్ల పై భారీగానే పడిందని చెప్పాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube