కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన అలియా.. సక్సెస్ అవుతారా..?

చేసింది తక్కువ సినిమాలే అయినా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సొంతం చేసుకున్నారు అలియా భట్.ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగుతెరకు అలియా భట్ పరిచయమవుతుండగా కొంతమంది టాలీవుడ్ స్టార్ హీరోలు తమ ఫ్యూచర్ ప్రాజెక్ట్ లలో అలియా భట్ ను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

 Alia Bhatt Turns As Producer Started Eternal Sunshine Productions-TeluguStop.com

అలియా భట్ ను తీసుకుంటే బాలీవుడ్ లో కూడా తమ సినిమాలపై అంచనాలు పెరుగుతాయని టాలీవుడ్ హీరోలు భావిస్తున్నారు.

ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న అలియా భట్ కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టారు.

 Alia Bhatt Turns As Producer Started Eternal Sunshine Productions-కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన అలియా.. సక్సెస్ అవుతారా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్న అలియా ప్రొడ్యూసర్ గా మారబోతున్నారు.ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్స్ పేరుతో సొంతంగా బ్యానర్ ను మొదలుపెట్టిన అలియా భట్ ఈ బ్యానర్ పై భవిష్యత్తులో సినిమాలను నిర్మించనున్నారు.

ఈ బ్యానర్ పై మంచి కథలను చెప్పబోతున్నానని అలియా భట్ వెల్లడించారు.

స్టార్ హీరోయిన్ గా సక్సెస్ లను సొంతం చేసుకున్న అలియా భట్ నిర్మాతగా కూడా సక్సెస్ అవుతారేమో చూడాల్సి ఉంది.

అయితే హీరోహీరోయిన్లు సినీ నిర్మాతలుగా పెద్దగా సక్సెస్ కాలేదు.మరోవైపు ఆర్ఆర్ఆర్ మూవీలో అలియా సీత పాత్రలో నటిస్తుండగా ఈ పాత్రకు సంబంధించిన లుక్ కానీ టీజర్ కానీ ఇప్పటివరకు విడుదల కాలేదు.

త్వరలో అలియా పాత్రకు సంబంధించి ఏదైనా అప్ డేట్ వస్తుందేమో చూడాల్సి ఉంది.

Telugu Alia Bhatt, Eternal Sunshine Productions, Rrr Movie, Turns Producer-Movie

ఇప్పటికే విడుదలైన రామరాజు ఫర్ భీమ్, భీమ్ ఫర్ రామరాజు టీజర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ రెండు టీజర్లకు యూట్యూబ్ లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.అలియా భట్ పాత్రకు సంబంధించి ఇప్పటికే కొంతభాగం షూటిం పూర్తి కాగా మరికొన్ని సీన్లను చిత్రీకరించాల్సి ఉందని తెలుస్తోంది.

దసరా పండుగ కానుకగా అక్టోబర్ 13వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

#EternalSunshine #Alia Bhatt #Turns Producer

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు