ఆ హీరోయిన్ కంటే యూట్యూబర్స్, ఇన్ స్టా రీల్స్ చేసే అమ్మాయిలు బెస్ట్?

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం బాగా ఎక్కువైపోయింది.దీనితో సోషల్ మీడియా వేదికగా కొత్త కొత్త సెలబ్రిటీలు సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.

 Alia Bhatt Trolled For Her Dance Performance, Alia Bhatt, Bollywood, Trolings, D-TeluguStop.com

టాలీవుడ్ లో ఇప్పటికే పలువురు సోషల్ మీడియా స్టార్ లు వెండి తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే.అలా ఇండస్ట్రీతో సంబంధం లేకుండా, సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకుని ఎంతోమంది నటీనటులు వెండితెరకు ఎంట్రీ ఇస్తున్నారు.

అంతేకాకుండా ఈ సోషల్ మీడియా ద్వారా బాగా ఫేమస్ అయిన వారు హీరోయిన్ ను మించి అందాలను ఒలకబోస్తూ, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకుంటున్నారు.అలాగే హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోరు అన్న విధంగా ఎక్స్పోజింగ్ చేస్తూ హాట్ ఫోటో షూట్ లతో విపరీతమైన ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.

ఇకపోతే తాజాగా హీరోయిన్ అలియా భట్ పై ఈ విషయంలో దారుణమైన ట్రోలింగ్స్ కి గురయ్యింది.బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ గురించి మనందరికీ తెలిసిందే.

Telugu Alia Bhatt, Bollywood, Dance Permance-Movie

ఆలియా భట్ తన డాన్సింగ్ స్కిల్స్ తో, తన అందం తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది.ఇటీవలే అలియా తన బెస్ట్ ఫ్రెండ్ అనుష్క రంజన్ వెడ్డింగ్ లో పాల్గొంది.ఈ వేడుకలో ఆలియా పలువురు గర్ల్ తో పాటు చల్కా చల్కా చల్కా రే పాటకు చిందులు వేసింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇందులో ఆలియా డ్యాన్స్ కు ఆమె అభిమానులు ఫిదా కాగా.కొందరు నెటిజన్లు మాత్రం ఆమె పై భారీగా ట్రోలింగ్ చేస్తున్నారు.

ఇంస్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ వీడియోల్లో కనిపించే అమ్మాయిలు తన కన్నా బాగా పర్ఫామెన్స్ చేస్తారని కామెంట్ చేస్తున్నారు.ఆమె వేసే డాన్స్ లో ఒక గ్రేస్ లేదు సిగ్గు లేదు బక్వాస్ పర్ఫామెన్స్ అంటూ విమర్శిస్తున్నారు.

మరి కొందరు తన లెహంగా దుప్పటా వేసుకోవడం కొత్త ట్రెండా అంటూ ప్రశ్నిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube