ఆర్ఆర్ఆర్ కోసం పాట పాడబోతున్న అలియా భట్‌  

Alia Bhatt To Shoot Big Song Sequence For RRR, Tollywood, Bollywood, RRR Movie, Jr NTR, Ram Charan - Telugu Alia Bhatt, Alia Bhatt To Shoot Big Song Sequence For Rrr, Bollywood, Jr Ntr, Ram Charan, Rrr Movie, Tollywood

రాజమౌళి దర్శకత్వంలో ఎన్ఠీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో పాన్ఇండియా మూవీగా తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ తర్వాత మరల రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది.ప్రస్తుతం ఎన్టీఆర్ కి సంబందించిన సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ రామ్ చరణ్ కి జోడీగా సీత పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

TeluguStop.com - Alia Bhatt To Shoot Big Song Sequence For Rrr Movie

ఇక ఎన్టీఆర్ కి జోడీగా హాలీవుడ్ హీరోయిన్ నటిస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ లో నవంబర్ 2 నుంచి అలియా భట్ పాల్గొంటుంది.రామ్ చరణ్, అలియా భట్ కాంబినేషన్ లో సన్నివేశాలని రాజమౌళి తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం అలియా మరో పాత్ర కూడా పోషించాబోతుంది.

ఈ సినిమాలో ఓ పాటని అలియా భట్ తో పాడించడానికి కీరవాణి రెడీ అయ్యాడు.ఇప్పటికే హిందీలో పలు సినిమాలలో పాటలు పాడి అలరించిన అలియాతో ఈ సినిమాలో కూడా పాడించాలని రాజమౌళి భావించినట్లు టాక్.

TeluguStop.com - ఆర్ఆర్ఆర్ కోసం పాట పాడబోతున్న అలియా భట్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

సినిమాలో ఆలియాభట్‌, రామ్‌చరణ్‌పై ఓ సాంగ్‌ ఉంది.ఈ సాంగ్‌ను ఆలియాభట్‌ ఆలపించనున్నారని తెలుస్తుంది.అయితే తెలుగు, తమిళ భాషల్లో పదాలు పలకడం కష్టం కాబట్టి ఆలియా హిందీలో మాత్రమే ఈ పాటను పాడనున్నారని తెలుస్తుంది.మరి ఈ వార్తలలో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడాలి.

ఇదిలా ఉంటే ఇక హాలీవుడ్ హీరోయిన్ కూడా నవంబర్ షెడ్యూల్ లో పాల్గొంటుందని తెలుస్తుంది.

.

#AliaBhatt #Ram Charan #Jr NTR #Alia Bhatt

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Alia Bhatt To Shoot Big Song Sequence For Rrr Movie Related Telugu News,Photos/Pics,Images..