ఆర్ఆర్ఆర్‌ను మరింత లేటు చేస్తున్న ఆలియా

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ఇండియన్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తు్న్నాడు.

 Alia Bhatt To Join Rrr Shooting Late, Alia Bhatt, Rrr, Rajamouli, Ram Charan, Nt-TeluguStop.com

అయితే ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు.

కాగా ఈ సినిమాలో సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.కాగా కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్‌ను ఇటీవల ప్రారంభించారు.

కానీ ఇప్పటివరకు ఆలియా భట్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ మొదలుపెట్టలేదు.దీంతో కొద్దిరోజుల క్రితం ఆలియా భట్ హైదరాబాద్ చేరుకుని ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో జాయిన్ అయ్యింది.

కానీ వెంటనే మళ్లీ ముంబైకి చెక్కేసింది ఈ బ్యూటీ.

కాగా మళ్లీ ఈ బ్యూటీ ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో ఎప్పుడు జాయన్ అవుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

అయితే ఆమె మళ్లీ ఆర్ఆర్ఆర్‌లో ఇప్పట్లో జాయిన్ అయ్యేలా కనిపించడం లేదు.దానికి కారణం కూడా బలమైనదే అని తెలుస్తోంది.ఆలియా భట్‌కు సన్నిహితంగా ఉండే వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆలియా భట్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లిందట.దీంతో ఆమె ఎప్పుడు ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో పాల్గొంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఆలస్యమవుతున్న ఆర్ఆర్ఆర్, ఇలా మరింత ఆలస్యం అవుతుందడటంతో ప్రేక్షకులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు.కాగా ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్లకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube