కరోనా నుంచి కోలుకున్న ఆర్ఆర్ఆర్ బ్యూటీ... విరామం లేకుండా షూటింగ్ లు

కరోనా సెకండ్ వేవ్ ప్రస్తుతం దేశాన్ని అతలాకుతలం చేస్తుంది.ముఖ్యంగా నార్త్ ఇండియా రాష్ట్రాలలో దీని ప్రభావం ఎక్కువగా ఉంది.

 Alia Bhatt Tests Negative For Covid 19-TeluguStop.com

దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసులలో మెజారిటీ అక్కడే ఉండటం ఇప్పుడు భయానకంగా ఉంది.ఇంకా చెప్పాలంటే దేశంలో కేవలం మహారాష్ట్రలో 60 శాతం కేసులో నమోదవుతున్నాయి.

ఇది బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం కలవరపెడుతుంది.బాలీవుడ్ లో చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు.

 Alia Bhatt Tests Negative For Covid 19-కరోనా నుంచి కోలుకున్న ఆర్ఆర్ఆర్ బ్యూటీ… విరామం లేకుండా షూటింగ్ లు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రణబీర్ కపూర్, అమీర్ ఖాన్ నుంచి పదుల సంఖ్యలో సెలబ్రిటీలు కరోనా బారిన పది హోం క్వారంటైన్ లో ఉంటున్నారు.కొంత మంది హాస్పిటల్ లో అత్యవసర చికిత్సలు కూడా తీసుకుంటున్నారు.

రణబీర్ కపూర్ కరోనా బారిన పడ్డ కొద్ది రోజులని అతని ప్రియురాలు ఆర్ఆర్ఆర్ హీరోయిన్ అలియా భట్ కి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.దీంతో ఆమె కూడా హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయింది.

రెండు వారల పాటు హోం క్వారంటైన్ లో ఉన్న తర్వాత తాజాగా మళ్ళీ టెస్ట్ చేసుకోగా కరోనా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది.దీంతో ఈ భామ ఊపిరి పీల్చుకుంది.

ప్రస్తుతం ఈ అమ్మడు వరుసగా పాన్ ఇండియా సినిమాలు లైన్ లో పెట్టింది.అయితే కరోనా కారణంగా ఆమె షూటింగ్ కి రాలేకపోవడంతో ఆమెకి సంబందించిన సన్నివేశాలని వాయిదా వేస్తూ వచ్చారు.

ఇప్పుడు కరోనా నుంచి కోలుకోవడంతో తిరిగి ఆమె షూటింగ్ కి రెడీ అవుతుంది.గంగూబాయ్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.

ఆ సినిమా ప్రమోషన్ తో పాటు బ్రహ్మాస్త్రతో పాటు ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో కూడా పాల్గొనాల్సి ఉంది.ఇప్పుడు గ్యాప్ లేకుండా అలియా భట్ వీటి మీద దృష్టి పెట్టనుంది.

#Alia Bhatt #Covid Negative #Corona Pandemic #COVID-19 #AliaBhatt

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు