అలియా భట్ సీతగా మారడానికి ఎంత కష్టపడిందో చూశారా.. మేకింగ్ వీడియో వైరల్!

Alia Bhatt Seetha Making Video Rrr Movie

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రం ఆర్ఆర్ఆర్.ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.

 Alia Bhatt Seetha Making Video Rrr Movie-TeluguStop.com

ఇందులో జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. జనవరి 7, 2022 న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

అయితే అంచనాల ప్రకారం ఈ సినిమా బడ్జెట్ కు సుమారుగా 450 కోట్లు ఉండవచ్చు సమాచారం.ఇక డిసెంబర్ 9న ఈ సినిమా ట్రైలర్ రాబోతోంది.

 Alia Bhatt Seetha Making Video Rrr Movie-అలియా భట్ సీతగా మారడానికి ఎంత కష్టపడిందో చూశారా.. మేకింగ్ వీడియో వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ ట్రైలర్ ను తెలుగు రాష్ట్రాలలోని ప్రధానమైన థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు చిత్రబృందం.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ సీత పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

 ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో అలియా భట్ పాత్రకు సంబంధించిన ఒక వీడియోని రిలీజ్ చేశారు చిత్ర బృందం.ఈ వీడియోలో అలియా నుంచి సీతగా మారే విధనాన్ని చూపించారు.

అందులో ఆలియా పోషిస్తున్న సీత పాత్రను తయారు చేసే విధానం, యాక్టింగ్ సీన్స్ ను చూపించారు.ఇందులో ఆలియాభట్ క్యూట్ క్యూట్ గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ముచ్చటగా కనిపించింది.

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చెర్రీ అభిమానులు, తారక్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు ఈ సినిమాపై మరింత హైప్ ను పెంచాయి.

కాగా వీటికి అనూహ్యమైన స్పందన వస్తోంది.

#Seetha #Aliya Bhatt

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube