'ఆర్ఆర్‌ఆర్‌' టీమ్ కు గుడ్‌ బై చెప్పేసిన ఆలియా

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో రూపొందుతున్న ఆర్‌ ఆర్ ఆర్‌ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది.ఇటీవల హైదరాబాద్ లో ప్రమోషనల్‌ సాంగ్‌ చిత్రీకరణ జరిపిన విషయం తెల్సిందే.

 Alia Bhatt Rrr Movie Shooting Update Details, Alia Bhatt, Film News, Ntr, Rrr, R-TeluguStop.com

ప్రమోషనల్‌ సాంగ్‌ చిత్రీకరణ కోసం ఆలియా భట్‌ మూడు రోజుల క్రితం హైదరాబాద్‌ వచ్చింది.నేడు షూటింగ్‌ ను ముగించుకుని ముంబయికి చెక్కేసింది.

షూటింగ్ కార్యక్రమాలు ముగించుకున్న ఆలియా భట్ చిత్ర యూనిట్‌ సభ్యులందరికి కూడా గుడ్‌ బై చెప్పేసింది.షూటింగ్‌ లో తనకు సంబంధించిన పార్ట్‌ మొత్తం ను కూడా పూర్తి చేసింది.

మళ్లీ విడుదల సమయంలో వారం రోజుల పాటు హైదరాబాద్‌ కు ఆమె ప్రమోషన్‌ కోసం వస్తుందని అంటున్నారు.ప్రస్తుతం చిత్ర యూనిట్‌ సభ్యులు జార్జియా వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

జార్జియాలో రెండు వారాల చిత్రీకరణతో మొత్తం షూటింగ్‌ ముగుస్తుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.జార్జియాలో హీరోలు ఇద్దరు మరియు కీలక నటీనటులు మాత్రమే పాల్గొనబోతున్నారు.హీరోయిన్‌ ఆలియా భట్ అక్కడ కనిపించదు.కనుక ఆలియా భట్‌ షూటింగ్‌ నేటితో పూర్తి అయ్యిందని యూనిట్‌ సభ్యుల ద్వారా తెలుస్తోంది.

రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను దక్కించుకోబోతున్న ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా లో భాగస్వామ్యం అయినందుకు చాలా అదృష్టవంతురాల్ని అంటూ ఎప్పటికప్పుడు చెప్పే ఆలియా భట్‌ షూటింగ్‌ ముగింపు సందర్బంగా యూనిట్‌ సభ్యులను వదులుతున్నందుకు ఎమోషనల్‌ అయ్యిందట.

Telugu Alia Bhatt, Aliabhatt, Ram Charan, Rrr Promotinal, Rrr Georgia-Movie

మొత్తంగా ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా షూటింగ్‌ కోసం ఆలియా అనుకున్న డేట్ల కంటే చాలా ఎక్కువగానే కేటాయించిందట.అందుకు రాజమౌళి కూడా గతంలో కృతజ్ఞతలు చెప్పాడు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆలియా పాత్ర గురించి విజయేంద్ర ప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి.

ఆమె పాత్ర సినిమాకే ఆయువు పట్టు అన్నట్లుగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube